శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నర్సుని టీచర్‌గా మారుస్తారట!

మితాబ్‌బచ్చన్‌, హేమమాలిని నటించిన ‘సత్తే పే సత్తా’... అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫరాఖాన్‌. ఇందులో హృతిక్‌ రోషన్‌, అనుష్కశర్మ నటించడం దాదాపు ఖాయమైంది అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ‘సత్తే పే సత్తా’లో హేమమాలిని నర్సుగా నటించారు. ఈ రీమేక్‌లో అనుష్క పాత్రని మోడ్రన్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నారట ఫరా. అనుష్కని ఓ టీచర్‌ పాత్రలో చూపించనున్నారని సమాచారం. ఫరాఖాన్‌ తొలి చిత్రం ‘మై హునా’. అందులో కథానాయిక సుస్మితాసేన్‌ కెమిస్ట్రీ లెక్చరర్‌గా నటించింది. ఆ పాత్ర స్ఫూర్తితోనే అనుష్క పాత్రను తీర్చిదిద్దుతున్నారట ఫరా. కానీ సుస్మిత చీరల్లో కనువిందు చేస్తే అనుష్క పాత్ర ఆహార్యం ఆధునికంగా ఉండనుందట.

శ్రీవారి దుస్తుల్లో...:
విరాట్‌ కోహ్లీ, అనుష్కశర్మ జంట ప్రస్తుతం విదేశాల్లో సరదాగా గడిపేస్తున్నారు. భర్తతో అన్యోన్యంగా ఉంటున్న అనుష్క ఈ మధ్య ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల్ని పంచుకొంది. తనకు విరాట్‌ దుస్తులు వేసుకోవడం అంటే ఇష్టమని చెప్పింది. ‘‘విరాట్‌ వార్డ్‌రోబ్‌ నుంచి చాలా దుస్తులు తీసుకుంటాను. వాటిలోంచి టీషర్ట్‌లు ఎక్కువగా  వేసుకుంటాను. అప్పుడప్పుడూ జాకెట్స్‌ ధరిస్తాను. మావారి దుస్తులు ధరించినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది’’ అని చెప్పింది అనుష్క.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని