శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

వేడుకలకు నిందితుడు ..బాధితురాలిపై నిషేధమా?

తమిళనాడు పెద్దలు బాగా న్యాయం చేశారు: చిన్మయి

చెన్నై: సాహితీ రచయిత వైరముత్తుపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అతడిపై ఎలాంటి ప్రభావం చూపలేదని గాయని చిన్మయి శ్రీపాద అసహనం వ్యక్తం చేశారు. అల్వార్‌పేటలో కమల్‌ హాసన్‌ నిర్వహించిన కె. బాలచందర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రజనీకాంత్‌తోపాటు వైరముత్తు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌, రజనీతో కలిసి వైరముత్తు తీసుకున్న ఫొటోను చిన్మయి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. నిందితుడు వైరముత్తు వేడుకలకు హాజరవుతుంటే బాధితురాలిని చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘మీటూ’ ఉద్యమం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషుల జీవితాలను నాశనం చేసింది (నేను వైరముత్తును ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలివి). కెరీర్‌ను దెబ్బతీసింది. అవమానభారంతో ఆ పురుషుడు బయట తన ముఖాన్ని కూడా చూపించలేడు. కానీ వైరముత్తు మాత్రం డీఎమ్‌కే కార్యక్రమాలు, ఐఏఎస్‌ అధికారుల శిక్షణా కార్యక్రమాలు, తమిళ భాష వేడుకలు, పుస్తక ఆవిష్కరణలు, సినిమా వేడుకలకు అతిథిగా వెళ్తున్నాడు. అతడిపై ఈ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపలేదు. నన్ను మాత్రం వెంటనే చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించారు. తమిళనాడు చిత్ర పరిశ్రమ పెద్దలు బాగా న్యాయం చేశారు. లైంగిక వేధింపులు చేసిన వ్యక్తితో పార్టీ.. బాధితురాలిపై నిషేధం’ అని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.

‘మీటూ’ ఉద్యమ సమయంలో వైరముత్తుపై చిన్మయి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం ఓ కార్యక్రమంలో వైరముత్తు తన అనుచరుడిని ఆమె వద్దకు పంపి.. గదికి రమ్మని పిలిచాడని ఆమె బయటపెట్టారు. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమెతోపాటు పలువురు మహిళలు వైరముత్తు తమను వేధించాడని పేర్కొన్నారు. ఆ తర్వాత చిన్మయిని తమిళ చిత్ర పరిశ్రమ డబ్బింగ్‌ సంఘం నుంచి నిషేధించారు. ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్నా ఆమె పోరాటం ఆపలేదు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని