శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

చిత్ర వార్తలు

ఇస్మార్ట్‌  బ్లూవేల్‌


చేతిలోని వస్తువులను దూరంగా విసిరి, తీసుకురమ్మని పెంపుడు జంతువులకు శిక్షణ ఇస్తుంటారు వాటి యజమానులు. కుక్కలు, పిల్లులు వంటి జంతువులు మాత్రమే ఈ పనిని చేస్తాయనుకుంటాం. ఇక్కడ ఓ బ్లూవేల్‌ ఆ పనిని మరింత సునాయాసంగా చేసి ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోను స్టాన్స్‌ గ్రౌండెడ్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఇంత అద్భుతమైన జీవులను కాపాడుకోవడం మన బాధ్యత. దయచేసి ప్లాస్టిక్‌ వస్తువులను సముద్రంలో పడేస్తూ వాటిని నాశనం చేయొద్దు’ అని వేడుకున్నాడు.

వేరే దారి లేక ఇలా..


ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా వసతిగృహం ఎదుట రోడ్డుపై విద్యార్థులు గంటల తరబడి బైఠాయించి ధర్నా చేశారు. దీంతో అటుగా వెళ్లాల్సిన ద్విచక్ర వాహనదారులంతా ఎడమ వైపున ఉన్న చెట్ల పొదల గుండా వేరే మార్గం కోసం అన్వేషించారు.

పెద్దనోట్ల రద్దుకు మూడేళ్లు


పెద్దనోట్లను రద్దు చేసి మూడేళ్లు పూర్తైన నేపథ్యంలో దిల్లీలోని రిజర్వ్‌ బ్యాంక్‌ కార్యాలయం ఎదుట యూత్‌ కాంగ్రెస్‌ ధర్నా చేపట్టింది. మోదీ మాస్కులు, నోట్ల దండలు ధరించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు.

కపోతమా.. కపటం తగునా..?


ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలోని ఓ స్మారకం వద్ద సైనికుల సమాధులపై ఉంచిన పూలు కొద్ది రోజుల కిందట మాయమైపోయాయి. ఏమైందో అంతు చిక్కక అక్కడ పనిచేసే సిబ్బంది తలలు పట్టుకున్నారు. అన్నీ మూలలూ వెతికితే అసలు విషయం తేలింది. అవన్నీ ఓ పావురం దొంగలించి, గూడు నిర్మించుకుందని తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

దిగ్గజ గురువు విగ్రహావిష్కరణ


తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విశ్వనటుడు కమల్‌హాసన్‌ కలిసి ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తన సినీ ప్రస్థానానికి 60ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్వార్‌పేటలో కమల్‌ ఈ విగ్రహాన్ని నెలకొల్పారు.

ఆహా..! ఏమి ‘రక్ష’ణ


చిలీలోని మౌంటెడ్‌ సెక్యూరిటీ బలగాల గుర్రాలకు తొడిగిన కవచాలు ఇవి. ప్రొవిడెన్సియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను పర్యవేక్షించే సైన్యం అశ్వాలు గాయపడకుండా తీసుకున్న జాగ్రత్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని