శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

తండ్రిని హత్య చేసిన తనయుడు

ఏర్పేడు: ఆస్తికోసం కుమారుడు కన్నతండ్రినే హతమార్చిన అమానవీయ ఘటన చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్పేడు మండలం చెంగెపల్లి గ్రామానికి చెందిన వెంకట చలపతి(63)కి తిరుమలలో రూ. 2 కోట్ల విలువైన రెండు దుకాణాలు, బాలాజీనగర్‌లో సొంత ఇల్లు, స్వగ్రామం చెంగెళ్లపల్లిలో ఐదెకరాల పొలం ఉంది. గత కొంత కాలంగా వెంకట చలపతి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఆస్తులన్నీ తన పేరుమీద చేయాలని చలపతి పెద్ద కుమారుడు సురేష్‌బాబు గత కొంత కాలంగా తండ్రిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16న సురేష్‌ బాబు తన స్నేహితుడు చిన్నాతో కలిసి తండ్రి వెంకట చలపతిని హతమార్చారు. అనంతరం  ఏర్పేడు సమీపంలోని సోమశిల స్వర్ణముఖి గద్దెపై పాతి పెట్టారు. వెంకట చలపతి కనిపించకపోవడంతో ఆయన సమీప బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఏర్పేడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో తనయుడే హత్య చేసినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. పూడ్చిపెట్టిన ప్రదేశానికి వెళ్లిన పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహం వెంకట చలపతిదేనని నిర్ధరించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని