శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఇలాంటి వారితో పొత్తు పెట్టుకున్నానా..

భావోద్వేగంగా మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్‌ 

ముంబయి: మహారాష్ట్రలో కూటమితో కూడిన ప్రభుత్వ ఏర్పాటు అనేది ఇప్పుడు భాజపా చేతుల్లోనే ఉందని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. ఒకవేళ కుదరకపోతే తమ వద్ద ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అమలుచేస్తామని తేల్చి చెప్పారు. శుక్రవారం ఫడణవీస్‌ రాజీనామా చేసిన అనంతరం ఉద్ధవ్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము కాంగ్రెస్‌, ఎన్సీపీలను సంప్రదించలేదన్నారు. అబద్ధాలను ప్రచారం చేయాలని చూస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒకరోజు శివసేన నాయకుణ్ని ముఖ్యమంత్రిని చేస్తానని.. తన తండ్రి బాల్‌ ఠాక్రేకు మాట ఇచ్చానని, ఇప్పుడు దాన్ని నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. 

‘‘రాష్ట్రంలో కూటమి ఉనికి భాజపాపైనే ఆధారపడి ఉంది. నేను ఎప్పుడూ చర్చలకు తలుపులు మూయలేదు. కానీ, నేను అబద్ధం చెప్పానని వారు అన్నప్పుడు బాధపడ్డాను. నా జీవితంలో ఎప్పుడూ నేను అబద్ధం చెప్పలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌పై నాకు గౌరవం ఉంది. అబద్ధాలు చెప్పడం హిందుత్వంగా ఎలా పరిగణిస్తారో ఆ సంస్థే చెప్పాలి. రాముడిని అనుసరించే వారు ఆయన సూత్రాలను ఎందుకు పాటించరు? దేవుడ్ని ప్రార్థించే నోటితోనే వారు అబద్ధాలు చెబుతుండటం నాకు షాకింగ్‌గా ఉంది. అమిత్‌ షా అండ్‌ కోను మహారాష్ట్ర ప్రజలు నమ్మరు. ఓ వైపు గంగా నదిని శుద్ధి చేస్తుండగా, మరోవైపు వారి మనస్సులు మొత్తం కాలుష్యమయ్యాయి. ఇలాంటి వారితో నేను పొత్తు పెట్టుకున్నానా..? అని నాకు అనిపించింది’’ అని ఉద్ధవ్‌ ఆవేదన భావోద్వేగంతో మాట్లాడారు.  

ఎన్సీపీతో కలిస్తే తప్పేంటి?
జమ్మూకశ్మీర్‌లో భాజపా పీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీతో జట్టు కడితే తప్పేంటి? అని ప్రశ్నించారు. శివసేన, ఎన్సీపీల జట్టు అసహజమైనదని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. 


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని