శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఆటోపై కంటైనర్‌ బోల్తా:12 మంది దుర్మరణం

బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం బెంగళూరు-చిత్తూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్‌ వద్ద వాహనాలపై నీళ్ల సీసాలతో వెళ్తున్న కంటైనర్‌ బోల్తాపడింది. బ్రేకులు విఫలం కావడంతో డివైడర్‌ దాటి ఆటో, ఓమ్ని వ్యాన్‌, ద్విచక్ర వాహనంపైకి కంటైనర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చీకటి పడటంతో తొలుత పోలీసులకు మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. 

పరామర్శకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..

గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన రెడ్డి శేఖర్‌ కుటుంబానికి చెందిన 8 మంది ఓమ్నీ వాహనంలో తెట్టుగుండ్లపల్లికి వెళ్లారు. తమ బంధువుల కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వారంతా వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పరామర్శకు వెళ్లినవారు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదంలో కంటైనర్‌ దూసుకెళ్లడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బంగారుపాళ్యం మండలం బలిజపల్లెకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలో మృతిచెందారు. దీంతోపాటు కంటైనర్‌ డ్రైవర్‌ కూడా అక్కడికక్కడే చనిపోయారు.  కంటైనర్‌ క్లీనర్‌ తీవ్రంగా గాయపడటంతో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కంటైనర్‌ ఒక్కసారిగా దూసుకెళ్లడంతో గుర్తుపట్టడానికి వీలులేని విధంగా మృతదేహాలన్నీ ఛిద్రమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా పరిశీలించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని