శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ప్రతిపక్షాలు కూడా ఎప్పుడూ అలా దూషించలేదు

ముంబయి: ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడడానికి శివసేనే కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆరోపించారు. అసెంబ్లీ పదవీకాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఆయన తన రాజీనామాను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శివసేనపై విమర్శలు గుప్పించారు.

‘‘శివసేన చెబుతున్నట్లు సీఎం పదవిపై ఎలాంటి ఒప్పందమూ కుదరలేదు. నా సమక్షంలో అలాంటిదేమీ జరగలేదు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభనకు శివసేనే కారణం. నేను ఎన్నోసార్లు ప్రయత్నించినా ఉద్ధవ్‌ నాతో మాట్లాడలేదు. కానీ ప్రత్యామ్నాయమంటూ ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారు’’ అని ఫడణవీస్‌ ఆరోపించారు. ‘‘గత 15 రోజులుగా శివసేన చేస్తున్న ప్రకటనలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మోదీపై కూడా విమర్శలు చేశారు. కానీ భాజపా నేతలెప్పుడూ బాల్‌ఠాక్రేని గానీ, ఉద్ధవ్‌ను గానీ విమర్శించలేదు. మోదీని ప్రతిపక్ష నేతలు కూడా ఎప్పుడూ అలా దూషించలేదు. ఆ పార్టీ వైఖరి చూస్తుంటే కూటమిలో ఉండడం ఇష్టం లేదనిపిస్తోంది’’ అని ఫడణవీస్‌ అన్నారు.

ఫడణవీస్‌ వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. తమతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే ముఖ్యమంత్రి పీఠంపై శివసేన నేత ఉండాలన్నారు. ఒకవేళ తన నేతృత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఫడణవీస్‌ భావిస్తే ఆయనకు తన శుభాకాంక్షలు అని రౌత్‌ వ్యంగ్యంగా అన్నారు. మోదీ, అమిత్‌షాపై అనవసరంగా విమర్శలు గుప్పించారన్న ఫడణవీస్‌ ఆరోపణలను తోసిపుచ్చారు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని