శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సీఎం పదవికి దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామా

ముంబయి: మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామా చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భాజపా సీనియర్‌ మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీకి రాజీనామా పత్రం సమర్పించారు. గవర్నర్‌ తన రాజీనామాను ఆమోదించినట్లుగా అనంతరం ఫడణవీస్‌ ప్రకటించారు. ఈ ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, ఇందుకు సహకరించిన పార్టీ సహచరులకు, శివసేన నేతలకు ఆయన ధన్యావాదాలు తెలిపారు.

ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ రోజు అర్ధరాత్రితో ముగియనున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఇంకా సందిగ్ధం కొనసాగుతున్నందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మిత్ర పక్షాలైన భాజపా, శివసేన కూటమి స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించినా, అధికార పీఠం విషయంలో ఇరు వర్గాల మధ్య పొరపొచ్చాలు తలెత్తిన సంగతి తెలిసిందే. సీఎం పదవిని చెరి సగం కాలం పంచుకోవాలనే శివసేన డిమాండ్‌కు భాజపా అంగీకరించడం లేదు. ఈసారి కూడా పూర్తి కాలం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఫడణవీస్‌ గతంలో స్పష్టం చేశారు. శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి, కీలక మంత్రి పదవులు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయినా, శివసేన 50:50 ఫార్ములాకు కట్టుబడి ఉంది. 

అక్టోబరు 24న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో భాజపా 105 సీట్లు గెల్చుకున్న సంగతి తెలిసిందే. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెల్చుకున్నాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు, స్వతంత్రులు గెలుపొందారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని