శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అందుకే షూట్‌కి వెళ్లడం లేదు: యాంకర్‌ ప్రదీప్‌

నా ఆరోగ్యంపై అనేక వదంతులు వచ్చాయి

హైదరాబాద్‌: తన ఆరోగ్యం బాగుందని, మరో వారంలో షూటింగ్‌లో పాల్గొంటానని ప్రముఖ యాంకర్‌, నటుడు ప్రదీప్‌ చెప్పారు. ఆయన గత కొన్ని రోజులుగా షూటింగ్‌లో పాల్గొనడం లేదు. ఈ క్రమంలో తన ఆరోగ్యంపై అనేక వదంతులు వచ్చాయని, అవి చూసి శ్రేయోభిలాషులు కంగారుపడ్డారని తాజాగా ప్రదీప్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా లైవ్‌లో మాట్లాడారు. ఫాలోవర్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

‘ఒక నెల నుంచి నేను షూటింగ్‌లకు వెళ్లడం లేదు. షూట్‌ ఉంటే.. ఏదో ఒక రూపంలో మీతో (ఫాలోవర్స్‌) మాట్లాడే అవకాశం ఉండేది. అందుకే ఇవాళ లైవ్‌లో మాట్లాడాలనుకున్నా. నా పుట్టినరోజున (అక్టోబరు 23) చాలా మంది విష్‌ చేశారు, థాంక్స్‌. షోకు ఎందుకు రావడం లేదని చాలా మంది అడిగారు, రిప్లై ఇవ్వలేకపోయాను. నెల రోజులుగా బ్రేక్‌లో ఉన్నాను, అయినా బోర్ కొట్టలేదు. నాకు షూట్‌ అంటే చాలా ఇష్టం కాబట్టి.. రోజంతా సెట్‌లోనే గడిచిపోయేది. ఇంత పెద్ద బ్రేక్‌ ఎప్పుడూ తీసుకోలేదు. సోషల్‌మీడియాలో మీ పోస్ట్‌లు చూస్తూ టైమ్‌పాస్‌ చేశా’.

‘కొందరు యూట్యూబ్‌లో నా గురించి వీడియోలు చేసి, పెట్టారు. ‘క్షీణించిన ప్రదీప్‌ ఆరోగ్యం, బాధలో ప్రముఖులు’ (నవ్వుతూ) అని రకరకాలుగా రాశారు (హెడ్డింగ్స్‌ మాత్రం సూపర్‌ క్రేజీగా పెట్టారు భయ్యా). నేనెలా ఉన్నానో నా వారికి తెలుసు. కానీ, బయటి వారు భయపడ్డారు. కంగారుపడి చాలా మంది ఫోన్లు చేశారు. చాలా రోజుల క్రితం షూట్‌లో నా కాలికి చిన్న గాయమైంది. దాని వల్ల ఎక్కువ సేపు నిలబడవద్దని  వైద్యులు చెప్పారు. ఇంకెక్కడైనా గాయమైతే అలానే షూట్‌ చేసేవాడ్ని కానీ.. కాలిపై భారం పడితే సమస్య వస్తుందన్నారు. అయినప్పటికీ నేను విశ్రాంతి తీసుకోకుండా షోలు చేస్తూ వచ్చాను. దాంతో నొప్పి ఎక్కువైపోయింది. అందుకే తప్పని పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకుంటున్నా. మరో వారంలో షూటింగ్‌కు హాజరు కాబోతున్నా. నాకు ఏదో అయ్యిందని తెలిసి.. ఎంతో మంది నేను కోలుకోవాలని కోరుకున్నారు. ఆ మెసేజ్‌లు చూసి చాలా సంతోషంగా ఫీలయ్యా. నా కుటుంబం ఇంత పెద్దదా.. అనుకున్నా’ అని ప్రదీప్‌ తెలిపారు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని