శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

గాంధీ కుటుంబానికి ఎస్‌పీజీ భద్రత తొలగింపు!

వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు

దిల్లీ: సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) సెక్యూరిటీని తొలగించాలని నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సోనియా సహా ఆమె పిల్లలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీకి ఇకపై జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత మాత్రమే ఉండనున్నట్లు ఆయన విశ్వసనీయంగా తెలిపారు. అయితే, ఈ విషయాన్ని ఇంకా గాంధీ కుటుంబానికి తెలియపర్చలేదని వెల్లడించారు. నాయకుల భద్రతపై ఇటీవల జరిపిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీ కింద గాంధీ కుటుంబం మొత్తానికి సుమారు 100 మంది సీఆర్‌పీఎఫ్‌ భద్రతా సిబ్బందిని కేటాయించనున్నారు. అయితే, గాంధీ కుటుంబానికి సెక్యూరిటీని తగ్గించడంపై కాంగ్రెస్‌ వర్గాల నుంచి దుమారం చెలరేగే అవకాశం ఉంది. 1991లో రాజీవ్‌ గాంధీ హత్య ఘటన తర్వాతి నుంచి వీరి కుటుంబానికి ఎస్‌పీజీ స్థాయి భద్రతను కేటాయించారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆమె అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన దృష్ట్యా 1988లో ఎస్‌పీజీని స్థాపించారు. మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు పదేళ్ల వరకూ ఈ రకమైన భద్రతను కల్పిస్తున్నారు. గత ఆగస్టులోనే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని