శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బన్ని కొత్త పోస్టర్‌పై తేదీ అందుకే వెయ్యలేదా?

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, గురువారం విడుదల చేసిన కొత్త పోస్టర్‌పై విడుదల తేదీని చిత్ర బృందం ప్రచురించలేదు. గతంలో విడుదల చేసిన పోస్టర్‌లో అల్లు అర్జున్‌ కోడిని పట్టుకుని వస్తుండగా, పక్కనే జనవరి 12, 2020 అని వేశారు. కాగా, తాజా పోస్టర్‌లో తేదీని ప్రచురించకపోవడంతో సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగానే మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా విడుదల కానుండటంతో రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఉండటంతో తేదీ మార్పు విషయంలో ఇరు చిత్ర బృందాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బన్ని చెప్పిన తేదీకి ఓ రోజు ముందు అంటే జనవరి 11న రానుండగా, మహేష్‌ ఓ రోజు తర్వాత జనవరి 13న రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకునే తాజాగా ‘అల.. వైకుంఠపురములో’ నుంచి వచ్చిన కొత్త పోస్టర్‌పై విడుదల తేదీని ముద్రించలేదని తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

చిత్రీకరణ చివరి దశకు..
మరోపక్క విడుదలకు ఇంకా రెండు నెలలే సమయం ఉండటంతో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారట త్రివిక్రమ్‌.  ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పారిస్‌లో జరుగుతోందట. అక్కడి అందమైన లొకేషన్లలో బన్ని - పూజాలపై ‘‘సామజవరగమన’’ పాటను చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే ఈ షెడ్యూల్‌ తుది దశకు చేరుకుందని, పారిస్‌ నుంచి చిత్ర బృందం తిరిగి రాగానే హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ జరగనుంది. దీంతో చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టేయాలని త్రివిక్రమ్‌ నిర్ణయించుకున్నారట. డిసెంబరు నుంచి నిర్మాణానంతర కార్యక్రమాలు చూసుకుంటూనే ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించాలని ప్రణాళికలు రచిస్తున్నారట. ‘అల వైకుంఠపురములో’ సుశాంత్, నవదీప్, టబు, నివేదా పేతురాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని