శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

‘చలో ట్యాంక్‌బండ్‌’కు అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస తలపెట్టిన రేపటి ‘చలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ను అఖిలపక్ష నేతలు కలిసి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఈ ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇచ్చేదని లేదని సీపీ స్పష్టం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ ఐకాస నేతలు, కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

‘చలో ట్యాంక్‌ బండ్‌’ కొనసాగుతుంది : అశ్వత్థామ


ఆర్టీసీ కార్మికుల ఇళ్లలో దాడులు చేస్తున్నారని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. కార్మిక నాయకులు, కార్మికులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. హయత్‌నగర్‌లో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ‘చలో ట్యాంక్‌ బండ్‌’ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. బెదిరింపులకు కార్మికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ రాత్రికి కార్మికులు హైదరాబాద్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని