శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బాలకృష్ణకు పోటీగా దిగుతున్నాడా?

చెన్నై: తమిళ స్టార్‌ హీరో కార్తి ఫుల్‌ జోష్‌తో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘దేవ్‌’, ‘ఖైదీ’ చిత్రాలతో పలకరించిన ఆయన.. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ప్రస్తుతం ఆయన తన వదిన జ్యోతికతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ వంటి వైవిధ్యభరిత కథా చిత్రంతో దర్శకుడిగా అందరి దృష్టినీ ఆకర్షించిన జీతూ జోసెఫ్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో దీన్ని రూపొందిస్తున్నారట. దీనికి తమిళ్‌లో ‘తంబి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా బాక్సాఫీస్‌ బరిలో దించాలని చిత్ర బృందం ఆలోచన చేస్తుందట. అంతేకాదు.. డిసెంబరు 20వ తేదీన థియేటర్లలోకి తేవడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 

ఇదే నిజమైతే కార్తి ఈ క్రిస్మస్‌ పోరులో బాలయ్య ‘రూలర్‌’, సాయిధరమ్‌ తేజ్‌ ‘ప్రతిరోజు పండగే’ చిత్రాలతో పోటీ పడాల్సి ఉంటుంది. అంతేకాదు అదేరోజు సల్మాన్‌ ఖాన్‌ ‘దబాంగ్‌ 3’ కూడా థియేటర్లలోకి రానుంది. తమిళనాట చూస్తే మాత్రం కార్తికి ఈ తేదీన పెద్దగా పోటీ లేనట్లే తెలుస్తోంది. ఎలాగూ ఆయన తాజాగా ‘ఖైదీ’ వంటి హిట్‌తో జోరు మీదున్నాడు కాబట్టి.. ఇటు తెలుగులోనూ అటు తమిళ్‌లోనూ ఆయన క్రేజ్‌ బాగానే పనిచేసే అవకాశముంది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు. అన్నట్లు మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కార్తికి జ్యోతిక అక్కగా కనిపించనుందట. సత్యరాజ్, నిఖిల విమల్, అమ్ము అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారట.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని