శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రోహిత్‌ శెట్టి కొత్త కారు ధరెంతో తెలుసా?

ముంబయి: అద్భుతమైన యాక్షన్‌ చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రోహిత్‌ శెట్టి. ఆయన తీసే చిత్రాల్లో ఎక్కువగా కార్లు, బైక్‌ల ఛేజింగ్‌ సన్నివేశాలే కనిపిస్తుంటాయి. కార్లు, బైక్‌లపై ఆయన ఇష్టం కేవలం సినిమాలకే పరిమితం కాదు. నిజ జీవితంలోనూ అవంటే రోహిత్‌కు చాలా ఇష్టం. అందుకే తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ కారు ఖరీదు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దాని ఖరీదు.. అక్షరాలా రూ.3 కోట్లట.

రోహిత్‌ కొత్త కారుతో దిగిన ఫోటోను సదరు కారు కంపెనీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘భారత్‌లోని అసాధారణ వ్యక్తుల కోసం ఒక అసాధారణ కారు. చిత్ర పరిశ్రమలో విజయవంతమైన ప్రముఖులు ఈ కారును ఇష్టపడుతున్నారు. ఇలాంటి అసాధారణమైన కారు రోహిత్‌ వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుంది’ అని ట్వీట్‌లో పేర్కొంది. తెలుగు హిట్‌ ‘టెంపర్‌’ హిందీ రీమేక్‌ ‘సింబా’తో రోహిత్‌ గత ఏడాది మంచి విజయం అందుకున్నారు. దీని తర్వాత ఆయన ‘సూర్యవంశీ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అక్షయ్‌ కుమార్, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని