శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

పంత్‌ స్టంపింగ్‌పై చాహల్‌ ఏమన్నాడంటే?

రాజ్‌కోట్‌: భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య గురువారం రాత్రి జరిగిన రెండో టీ20లో రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా బంగ్లా ఓపెనర్లు లిటన్‌ దాస్‌(29), మహ్మద్‌ నయీమ్‌(36) శుభారంభం చేశారు. బంగ్లాదేశ్‌ 5 ఓవర్లకే 40కి పైగా స్కోర్‌తో జోరుమీద కనిపిస్తుండగా చాహల్‌ ఆరో ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. ఆ సమయంలో బ్యాటింగ్‌ చేస్తున్న లిటన్‌ దాస్‌ ఓ బంతిని ఆడేందుకు ముందుకొచ్చి స్టంపౌటయ్యాడు. అయితే, పంత్‌ బంతి అందుకునేటప్పుడు అతడి చేతులు వికెట్ల మీద ఉండడంతో అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో బంగ్లా ఓపెనర్‌ స్టంపౌట్‌ నుంచి తప్పించుకున్నాడు. అయితే, 8వ ఓవర్‌లోనే దాస్‌ మళ్లీ పంత్‌ చేతిలో రనౌటవ్వడం గమనార్హం.

మ్యాచ్‌ అనంతరం రిషభ్‌పంత్‌ తప్పిదంపై స్పందించిన చాహల్‌ అవన్నీ ఆటలో భాగమేనన్నాడు. ‘లిటన్ దాస్‌ను ఔట్‌ చేసే క్రమంలో పంత్‌ వికెట్లపై చేతులు పెట్టడం ఆటలో సహజమే. మేమంతా జట్టులో సహచరులం. ఒక్కోసారి నేను కూడా క్యాచ్‌లు వదిలేస్తా. ఎవరూ కావాలని క్యాచ్‌లు, స్టంపులు వదిలేయరు. కాబట్టి పంత్‌పై ఎలాంటి కోపం లేదు. అదంతా దురదృష్టం. అయితే.. డెత్‌ ఓవర్లలో, పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయడం ద్వారా మరింత విశ్వాసం పెరుగుతుంది. నేను టీమిండియాకు దూరంగా ఉన్నప్పుడు తడి బంతితో ప్రాక్టీస్‌ చేశాను కాబట్టి, తేమ నాపై ప్రభావం చూపలేదు. బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడాలనుకుంటున్నాడనే విషయాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా బౌలింగ్‌ చేస్తా’ అని చాహల్‌ చెప్పుకొచ్చాడు.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని