శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మారేడుమిల్లి: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు మధ్య ఓ  టెంపో వాహనం ప్రమాదానికి గురైంది. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద  టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరొకరు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. టెంపో మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. పర్యాటకులంతా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లాలోని చెలకెరి గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. భద్రాచలం దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో టెంపోలో 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 

ఆ రహదారి.. ప్రమాదకరం
మారేడుమిల్లి-చింతూరు రహదారి లోయలు, గుట్టలతో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఈ రహదారిలో చాలా నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఎక్కువగా వాహనాలు నడుపుతుంటారని.. కొత్తగా వచ్చేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

 

 


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని