శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కేటీఆర్‌ అలానే పాపులర్‌ అయ్యారు: పొన్నం

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని కోరుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఏ అంశంపై అయినా అవసరమున్నా లేకున్నా ట్విటర్‌లో స్పందించే మంత్రి కేటీఆర్‌.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు పొన్నం ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్‌ అంటే కల్వకుంట్ల తారక రామారావు కంటే కల్వకుంట్ల ట్విటర్‌ రావుగానే బాగా ప్రచారంలోకి వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికలకు ముందు కేసీఆర్‌ హామీ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ‘‘యాభై వేల ఆర్టీసీ కార్మికుల బాధ మీకు కనబడడం లేదా? ఉద్యోగాలు తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డుకు మీదుకు రావా?ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదు?’’ అని పొన్నం మండిపడ్డారు. ఆర్టీసీ సమస్యలపై కేటీఆర్ స్పందించకపోతే తెలంగాణ ప్రజల దృష్టిలో ఆయన ద్రోహిగా మిగులుతారన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని