శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బాలయ్య-ఎన్టీఆర్‌ ఆ వేదికపై కలిసినప్పుడు...

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అంటే జూ.ఎన్టీఆర్‌కు ఎంతో అభిమానమని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’ పేరుతో ఆయన సినీ జ్ఞాపకాలను పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. బాలయ్య-ఎన్టీఆర్‌ తొలిసారి మాట్లాడుకున్న సందర్భాన్ని తాజాగా ఆయన పంచుకున్నారు.

‘‘ఇటీవల వాట్సాప్‌లో నాకో ఫొటో వచ్చింది. అందులో చిన్నరామయ్య(ఎన్టీఆర్‌)-బాలకృష్ణకు కలిపి దండ వేసిన ఫొటో ఎవరో పంపారు. అది చూడగానే నాకు ‘అల్లరి రాముడు’ నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. శివరాత్రి సమయంలో పాలకొల్లులో షూటింగ్‌ జరుగుతోంది. షూటింగ్‌ విరామంలో నేనూ చిన్నరామయ్య మాట్లాడుకుంటున్నాం. ‘అందరితో మాట్లాడతావా నాన్నా’ అని నేను అడగ్గానే.. ‘లేదు పెదనాన్న.. కానీ, బాబాయ్‌ అంటే నాకు ప్రాణం. ఒక సగటు అభిమానిలా ఆయనను ఆరాధిస్తా. థియేటర్‌లో తెరపై ఆయన కనపడగానే నేను కూడా పేపర్లు చింపి ఎగరేసిన సందర్భాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చాడు. ‘ఏంటీ బాబాయ్‌తో మాట్లాడతావా’ అని నేను అడగ్గానే అక్కడే ఉన్న అడ్డాల చంటి ఒడిలో పడుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడు. వెంటనే నేను బాలయ్యబాబుకు ఫోన్‌ చేసి, ‘తారక్‌తో మాట్లాడు’ అని చెప్పా. ఆయన ‘సరే ఇవ్వండి’ అన్నారు. నాకు తెలిసి బాలయ్య బాబు, తారక్‌ మాట్లాడుకున్న తొలి సందర్భం అదేననుకుంటా’’

‘‘బాలయ్యబాబు ఫోన్‌లో మాట్లాడుతుంటే పసి పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆయనంటే అంత ప్రాణం తారక్‌కి. అయితే, అది జరిగిన తర్వాత వీరిద్దరూ కలిసి స్టేజ్‌పై కనపడితే బాగుంటుందనిపించింది. 2001లో సినీ గోయర్స్‌ అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇద్దరినీ పిలిపించి, తారక్‌తో బాలయ్యకు దండ వేయించాం. ఆ తర్వాత ఒకే దండను ఇద్దరి మెడలోనూ వేశాం. దండ వేయడానికి వెళ్తూ, చిన్నరామయ్య ఎంతో ఉద్విగ్నతకు గురయ్యాడు. ఆ సన్నివేశం అద్భుతమైన ఆవిష్కరణ. ఆ తర్వాత శిల్ప కళా వేదికలో ‘అల్లరిరాముడు’ 100 రోజుల కార్యక్రమం జరిగింది. హరికృష్ణకు, చిన్నరామయ్యకు కలిపి అదే విధంగా ఒకే దండ వేశారు. ఇలాంటి మధుర స్మృతులను ఎవరూ మర్చిపోలేరు. బాలయ్య, చిన్నరామయ్య ఇద్దరూ తమ చిత్రాలతో బిజీగా ఉన్నారు. నందమూరి కుటుంబం కలిసి కట్టుగా ఉండి, మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని పరుచూరి గోపాలకృష్ణ తన జ్ఞాపకాలను పంచుకున్నారు.

 


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని