శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

తెలంగాణ బంద్‌పై రేపు ప్రకటన: కోదండరాం

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె, భవిష్యత్‌ కార్యాచరణపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన అఖిలపక్షాల సమావేశం ముగిసింది. అనంతరం తెజస అధ్యక్షుడు కోదండరాం తదితరులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బంద్‌పై రేపు మధ్యాహ్నం ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్లే ఆర్టీసీ సమ్మె అని వార్యమైందని.. తక్షణమే ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర జరుగుతోందని.. దీన్ని అన్ని పార్టీలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మరో సకలజనుల సమ్మెకు సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఆర్టీసీ సమ్మె..సకల జనుల సమ్మెగా మారుతుందని కోదండరాం హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసి పోరాడాలన్నారు. మన లక్ష్యం ఒక్కటేనని.. కార్యాచరణ రకరకాలుగా ఉండాలని అభిప్రాయపడ్డారు. సమ్మెపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయాలని అఖిలపక్షాల నేతలు నిర్ణయించారు.

హుజూర్‌నగర్‌లో మద్దతుపై పునరాలోచిస్తాం
ఆర్టీసీపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే హుజూర్‌నగర్‌లో తెరాసకు మద్దతుపై పునరాలోచన చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే సహించేది లేదన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ గురువారం అన్ని డిపోల వద్ద ధర్నాలు, ర్యాలీలు  చేపట్టి నిరసన తెలుపుతామన్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని