శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఇసుక మాఫియాలో మంత్రులకూ వాటా:సుజయ్‌

విజయవాడ: వైకాపా శ్రేణుల్ని పోషించటానికే ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చిందని తెదేపా నేత, మాజీమంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు ఆరోపించారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక మాఫియాలో మంత్రులు కూడా పాలుపంచుకుంటూ ప్రజా శ్రేయస్సును గాలికొదిలేశారని విమర్శించారు. నిరసన తెలుపుతున్న భవన నిర్మాణ కార్మికులకు తెలుగుదేశం అండగా ఉంటుందన్నారు. వైకాపా నేతలు నిర్వహించే ఇసుక రీచ్‌లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తెదేపా పోరాడుతోందని సుజయ్‌ చెప్పారు. తెదేపా తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని దుయ్యబట్టారు. పెట్టుబడిదారుల్లో చంద్రబాబు కల్పించిన నమ్మకాన్ని జగన్‌ కోల్పోయేలా చేశారని ఆరోపించారు. సామాన్యులపై ఇసుక భారం మోపి భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కేలా చేశారని దుయ్యబట్టారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎస్‌బీఐ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. జగన్ ప్రభుత్వంపై బ్యాంకర్లలోనూ విశ్వాసం లేదనటానికి ఎస్‌బీఐ రాసిన లేఖ నిదర్శనమని సుజయ్‌ చెప్పారు. దీనికి సంబంధించిన లేఖ ప్రతిని ఆయన విడుదల చేశారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని