శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

జాలీకి ఆడ పిల్లలంటే పడదా..?

కేరళ వరుస హత్యల నిందితురాలి గురించి షాకింగ్‌ విషయాలు

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్‌లో సంచలనం సృష్టించిన 6 వరుస హత్యల ఘటన నిందితురాలు జాలీ గురించి సిట్‌ షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో సిట్‌ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఆమెను ప్రశ్నించగా హత్యల గురించి కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగుచూశాయి. 

సిట్‌ చెప్పిన వివరాల ప్రకారం.. నిందితురాలు జాలీకి ఆడపిల్లలంటే పడదని తేలింది. ఆ కోపంతోనే మొదటి భర్త సోదరి కుమార్తె ఆల్ఫైన్‌ను అంతమొందించిందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులను సైనేడ్‌ను ఆహారంలో కలిపి చంపిన ఆమె.. మరో ఇద్దరు పిల్లల్ని సైతం అంతమొందించాలని చూసిందని పేర్కొన్నారు. 2002లో అన్నమ్మ థామస్‌తో హత్యలు మొదలు పెట్టిన జాలీ.. వరుస హత్యల కేసును విచారణ చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్‌ కుమార్తెనూ విషం పెట్టి చంపాలని ప్రయత్నించినట్లు సిట్ తెలిపింది. మరోవైపు జాలీ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఇంజినీరింగ్‌ పట్టా కూడా అందుకుంది. నిట్‌లో కొన్ని రోజులు పాఠాలు చెప్పినట్లు జాలీ చెబుతున్నా.. నిట్‌ యాజమాన్యం మాత్రం ఆ వ్యాఖ్యలను కొట్టిపారేస్తోంది.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని