శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సముద్ర దొంగల గురించి ఆసక్తికర విషయాలు!

దొంగల్లో చాలా రకాలు ఉంటారు. రోడ్డు మీద వెళ్తున్న వారి మెడలోంచి గొలుసును లాక్కెళ్లే చైన్‌ స్నాచర్లు.. రద్దీ ప్రదేశాల్లో చేతివాటం ప్రదర్శించే జేబు దొంగలు.. బ్యాంకులకు కన్నాలు వేసే కంత్రీలు.. రాత్రుళ్లు ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులు, డబ్బులు దొంగిలించే ఘరానాగాళ్లు.. ఇలా చాలా రకాల దొంగలను రోజు మనం టీవీల్లోనో.. పేపర్లోనో చూస్తూనే ఉన్నాం. ఒక్కో దొంగతనం చేసే దొంగలకు ఒక్కో శైలి ఉంటుంది. అయితే అన్నింటికి మించి సముద్ర నౌకల్లో దోపిడే చేసే ముఠాలు (పైరేట్స్‌) ఎలా ఉంటారో తెలుసా? వారి జీవన విధానం తెలుసుకోవాలని ఉందా? అయితే ఆ ఆసక్తికర విషయాలు మీ కోసం..

ప్రత్యేకమైన డ్రెస్సింగ్‌ స్టైల్‌
మాములుగా సినిమాల్లో చూపించే దొంగలు ఒంటికి నూనె పూసుకుని.. నల్లటి రంగు వస్త్రాలు, మాస్క్‌ ధరించి ఉంటారు. అదే సముద్ర దొంగలు ఎలా ఉంటారో హాలీవుడ్‌ మూవీ ‘పైరేట్స్‌ ఆఫ్‌ కరీబియన్‌’లో మనకు చూపించే ప్రయత్నం చేశారు. అయితే వాస్తవానికి సముద్ర దొంగలు ఇలా ఉండకున్నా.. కొంచెం అదే స్టైల్‌లో ఉంటారని నావికులు చెబుతుంటారు. సముద్ర దొంగలు వారి తల చుట్టూ కర్చీఫ్‌ లాంటి వస్త్రాన్ని కట్టుకుంటారు. పెద్దదైన టోపీని ధరిస్తారు. వారిచేతిలో పొడవాటి కత్తి, చిన్న తుపాకీ వంటి ఆయుధాలు ఉంటాయి. కాళ్లకి పొడవాటి షూ ధరిస్తారు. ముఖం కనపడకుండా ఉండేందుకు కళ్లకు మాస్క్‌ను పెట్టుకుంటారు. 

ప్రత్యేక జెండా
ఎవరైనా సరే ఒక ప్రదేశంలో తమ అధికారం చెలాయిస్తున్నారంటే.. దానికి గుర్తుగా అక్కడ వారి జెండాను ఎగరేస్తారు. ఇలా రాజ్యానికో జెండా ఉంటుంది. అలాగే సముద్ర దొంగలు కూడా తమ గుర్తింపు కోసం ఓ ప్రత్యేకమైన జెండాను వారు ఆక్రమించిన నౌకల మీద, వారు ప్రయాణించే నౌకలపై ఎగరేస్తారు. ఈ జెండాలు భయంకరమైన చిత్రాలతో కూడుకొని ఉంటాయి. సముద్ర దొంగలపై అధ్యయనం చేసే పరిశోధనల ప్రకారం..  మనం హెచ్చరిక కోసం ఉపయోగించే పుర్రె, రెండు ఎముకల గుర్తే వారి జెండాపై ఉంటుందట. ఎక్కడైతే సముద్ర దొంగలు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తారో అక్కడ ఈ జెండాను ఎగరేస్తారని పరిశోధకులు చెబుతున్నారు. 

కొన్ని నియమాలు 
సముద్ర దొంగలు.. నౌకలను దోచుకునేందుకు కొన్ని నియమాలను పాటిస్తారు. వారి పని సజావుగా సాగేందుకు ఈ నియమాలను ప్రతి ఒక్కరూ పాటిస్తారు. ముఖ్యంగా నౌకలను గుర్తించేందుకు ‘పైరెట్స్‌ కోడ్‌’ను వారు వాడతారు. ఈ కోడ్‌ ఒక్కో నౌకకు వేర్వేరుగా ఉంటుంది. దోచుకున్న సొత్తును పంచుకునేందుకు కూడా వీరికి నియమాలు ఉంటాయి. ఈ నియమాల ప్రకారం సొమ్మును పంచుకుంటారు. నౌకలో లైట్లను రాత్రి 8 గంటల వరకే వెలిగించాలని నియమం పెట్టుకున్నారు. ఇలా నియమాలను పాటిస్తూ సముద్ర రక్షక దళాల కంటపడకుండా జాగ్రత్తపడతారు.

ఆహారం ఎలాంటిది తీసుకుంటారు ?

మాములుగా భూ ఉపరిలతంపై జీవించే వారికి తినేందుకు అందుబాటులో చాలా పదార్థాలు ఉంటాయి. వీరు నిల్వ చేసిన ఆహారం కాకుండా తాజా ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. మరి సముద్రదొంగలు నెలల కొద్ది నౌకలోనే గడపాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరు తీసుకునే ఆహార పదార్థాల కోసం ప్రత్యేకమైన మెనూను ఫాలో అవుతారు. ముఖ్యంగా ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే పదార్థాలను సముద్ర దొంగలు తమ మెనూలో ఉంచుకుంటారు. పాలు, గుడ్లు, మాంసం లాంటి వాటిని సముద్రంలోకి వెళ్లిన మొదటి రోజుల్లో తింటారు. తర్వాత వేపుళ్లు, బిస్కెట్లు, ఎండిన బీన్స్‌, ఉప్పు కలిపిన మాంసం, దుంపలు లాంటి వాటిని తీసుకుంటారు. తమతోపాటు తీసుకెళ్లిన నీరు అయిపోతే దాహం తీర్చుకునేందుకు బీర్లు, వర్షపు నీటిపై సముద్ర దొంగలు ఆధారపడతారు. 

ప్రస్తుతం ఎక్కడ ఎక్కువగా ఉన్నారంటే?
గతంలో సముద్రదొంగలు చిన్న పెద్ద మహాసముద్రాల్లో ఉండేవారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, నావిగేషన్‌ వ్యవస్థ సులభం కావడం, రక్షణ కోసం అధునాతన ఆయుధాలను నావికులు ఉపయోగించడం, సముద్ర ప్రయాణానికి కచ్చితమైన మార్గాలు కనిపెట్టడం వంటి కారణాల వల్ల సముద్రదొంగలు ఇప్పుడు తక్కువై పోయారు. ఎంతలా అంటే ప్రస్తుతం వారి ఉనికే లేనంతంగా. అయితే ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా కొన్ని ప్రదేశాల్లో సముద్రదొంగలు దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఇండోనేషియా, సోమాలియా, నైజీరియా వంటి దేశాల తీరాల్లో వీరు ఎక్కువగా తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇంటర్నేషనల్ మారిటైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం నైజీరియా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ సముద్ర దొంగతనాలు జరుగుతున్నాయని వెల్లడైంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని