శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డార్క్‌ మోడ్‌’ వచ్చేస్తోంది

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లు తమ కొత్త వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో సిస్టమ్‌ వైడ్‌ డార్క్‌ మోడ్‌ను లాంచ్‌ చేశాయి. దీంతో  యాప్‌లన్నీ డార్క్‌ మోడ్‌ నామజపం చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్‌ యాప్స్‌ డార్క్‌ మోడ్‌ ఆప్షన్‌ను టెస్ట్‌ చేస్తున్నాయి. జీమెయిల్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆలో లాంటి యాప్‌లకు డార్క్‌ మోడ్‌ టెస్టింగ్‌ జరుగుతోంది. మరికొన్ని సంస్థలైతే  డార్క్‌ మోడ్‌ను తీసుకొచ్చేశాయి. నోవా లాంటి లాంచర్లు కూడా డార్క్‌గా తయారై వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్‌ కూడా ఇటువైపు చూస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో డార్క్‌ మోడ్‌ను టెస్టింగ్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌ షాట్లు బయటికొచ్చాయి. 

ఇన్‌స్టాగ్రామ్‌ డార్క్‌ మోడ్‌ వెర్షన్‌ వారం రోజుల్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. డార్క్‌ మోడ్‌  టెస్టింగ్‌లు కూడా పూర్తి చేసిందట. మరి బీటా వెర్షన్‌కు తొలుత రిలీజ్‌ చేస్తారో లేక డైరెక్ట్‌గా స్టేబుల్‌కి ఇస్తారో చూడాలి.  ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ల్లో ఒకేసారి డార్క్‌ ఇన్‌స్టా రాబోతోందట. ఐఓఎస్‌ 13, ఆండ్రాయిడ్‌ 10 యూజర్లకు మాత్రమే ‘డార్క్‌’ ఇన్‌స్టా రాబోతోంది. కస్టమ్‌ యూఐ ఆధారంగా పని చేసే మొబైళ్లలో ఇప్పటికే డార్క్‌ మోడ్‌ ఉంది. అలాంటి యూఐ వాడుతున్న మొబైల్స్‌కూడా ఈ ఆప్షన్‌ అందుబాటులోకి వస్తుంది. అయితే మొబైల్‌ డార్క్‌ మోడ్‌లో పెడితే యాప్‌ డార్క్‌ మోడ్‌లోకి వెళ్తుంది. అంతేకానీ యాప్‌లో మోడ్‌ టాగుల్‌ ఉండదు. 

డార్క్‌ మోడ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ మరో ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. యాక్టివిటీ ఫీడ్‌లో ముఖ్యమైన ఫాలోయింగ్‌ ట్యాబ్‌ను తీసేస్తోంది. నిజానికి ఈ తొలగింపు ప్రక్రయ ఆగస్టులోనే మొదలైంది. అయితే కొందరికి మాత్రం ఈ ఆప్షన్‌ కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఫాలోయింగ్‌ని తొలగించేశారు. 2011లో యూజర్లకు ఉపయుక్తంగా ఉంటుందని ఫాలోయింగ్‌ ట్యాబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు యూజర్ల కోసమే ఈ ఫీచర్‌ని తీసేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ చెబుతోంది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని