శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

భర్త క్షణికావేశానికి భార్య బలి

తల్లిని కోల్పోయిన పిల్లలు

 

ఆదోని నేరవార్తలు, కోసిగి, న్యూస్‌టుడే : క్షణికావేశం.. ఎంతపనైనా చేయిస్తుందనడానికి నిదర్శనం సోమవారం కోసిగిలో భార్యను భర్త హతమార్చిన ఘటన. కోసిగి గ్రామానికి చెందిన ఆకుల అనితపై ఆమె భర్త కేశవ్‌ విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. కోసిగి ఎస్సై ధనుంజయ్‌, అనిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కోసిగి గ్రామానికి చెందిన పి.ఈరన్న, పి.పార్వతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో చిన్న కుమార్తె అనితను తాడిపత్రికి చెందిన కేశవ్‌కు ఇచ్చి 13 ఏళ్ల కిందట వివాహం చేశారు. వీరికి కుమారుడు ఉదయ్‌ హర్షిత్‌, కుమార్తె సాయి విద్య ఉన్నారు. అనితను కొన్నేళ్లుగా భర్త కేశవ్‌ వేధింపులకు గురి చేస్తుండేవాడు. పలుమార్లు పెద్దలు పంచాయితీ పెట్టి కలిపారు. ఏడాదిన్నర కిందట అనితను భర్త మళ్లీ వేధించడం ఎక్కువ కావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ పిలిపించి పెద్దలు నచ్చజెప్పారు. అనంతరం కోసిగిలోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు భర్త భార్యను మళ్లీ వేధింపులకు గురి చేస్తుండేవారనీ, ఈక్రమంలోనే ఆదివారం రాత్రి కేశవ్‌ దసరా పండగకు తాడిపత్రికి వెళ్దామని భార్య అనితకు చెప్పడంతో ఆమె నిరాకరించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న భార్యపై క్షణికావేశంతో బండరాయితో బాది కత్తెరతో గొంతుపై పొడిచి హత్య చేశాడు. పిల్లలు ఏడుస్తూ సమీపంలో ఉన్న తాత ఇంటికి వెళ్లి చెప్పారు. కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న అనితను చూసి కోసిగి పోలీసులకు తెలియజేశారు. ఎస్సై ధనుంజయ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తల్లి మృతితో ఇద్దరు పిల్లలు అమ్మ ప్రేమకు దూరమయ్యారు. అనిత తండ్రి ఈరన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కేశవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.


హత్యకు గురైన అనిత (పాతచిత్రం)

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని