శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఒక్కో పరుగు తీసేందుకు కష్టపెడతారు

ఆసీస్‌ బౌలర్లను కొనియాడిన ఇంగ్లాండ్‌ ఓపెనర్‌

లండన్‌: ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జోడెన్లీ ఆసీస్‌ బౌలర్లను కొనియాడాడు. ఒక్కో పరుగు తీసేందుకు కంగారూలు చాలా కష్టపెడతారని చెప్పాడు. బ్యాట్స్‌మన్‌ ఓపెనింగ్‌ చేసే ప్రతిసారీ బాగా ఆడి మంచి పరుగులు సాధించాలనే అంచనాలు ఉంటాయని, ఈ రోజు తాను బాగా ఆడానని చెప్పాడు. తన ఆట పట్ల సంతోషంగా ఉన్నానని ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మన్‌ చెప్పుకొచ్చాడు. కాగా మూడోరోజు ఆసీస్‌ బౌలర్లు పదునైన బంతులేశారని, వారి అటాకింగ్‌ బాగుందని మెచ్చుకున్నాడు. ఈ పరిస్థితుల్లో తాను శతకం చేసి ఉంటే ఇంకా బాగుండేదని 94 పరుగులు చేసిన డెన్లీ పేర్కొన్నాడు. ఈ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాననే ఆశాభావం ఉందని, ప్రస్తుతం తమ జట్టు మంచి స్థితిలో ఉందని తెలిపాడు.

అలాగే ఇంగ్లాండ్‌ జట్టుకు ఆడటం తాను గౌరవంగా భావిస్తున్నాని అన్నాడు. కెప్టెన్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయమంటే అక్కడ చేస్తానని, తనకు నచ్చినట్లు బ్యాటింగ్‌ చేయడానికి తాను డిమాండ్‌ చేయనన్నాడు. కొన్నేళ్లవరకు తాను ఇంగ్లాండ్‌ తరఫున క్రికెట్‌ ఆడతానని ఊహించలేదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలనుకుంటున్నాని చెప్పాడు. భవిష్యత్‌లోనూ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గానే దిగాలంటే అందుకు సంతోషంగా అంగీకరిస్తానని డెన్లీ వెల్లడించాడు. కాగా మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లాండ్‌ 382 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చేతిలో ఇంకా రెండు వికెట్లు ఉన్నందున ఆసీస్‌ ముందు భారీ లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉంది. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఆసీస్‌ వికెట్లు కాపాడుకుంటే లక్ష్యం ఛేదించే అవకాశం లేకపోలేదు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని