శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

స్మిత్‌ అద్భుత క్యాచ్‌ చూశారా?

డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టిన స్మిత్‌

లండన్‌: శనివారం ఓవర్‌నైట్‌ స్కోర్‌ 9/0తో మూడోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్‌ మ్యాచ్‌పై పట్టు బిగించింది. జోడెన్లీ(94), బెన్‌స్టోక్స్‌(67), జోస్‌ బట్లర్‌(47) రాణించడంతో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ శనివారం సాయంత్రం అందుకున్న ఓ క్యాచ్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లాండ్‌ స్కోర్‌ 305 పరుగుల వద్ద మిచెల్‌మార్ష్‌ బౌలింగ్‌లో క్రిస్‌వోక్స్‌(6) ఆడిన బంతి స్లిప్‌లో దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న స్టీవ్‌స్మిత్‌ కుడివైపు డైవింగ్‌ చేస్తూ అమాంతం గాల్లో ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టాడు. దీంతో ఏడో వికెట్‌గా అతడు వెనుదిరిగాడు. కాసేపటికే బట్లర్‌ కూడా ఔటవ్వగా శనివారం ఇంగ్లాండ్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 

ఇప్పటికే 2-1తో వెనుకంజలో ఉన్న ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. శనివారం మూడోరోజు ఆట పూర్తయ్యేసరికి తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 69 పరుగుల ఆధిక్యాన్ని కలిపి 382 పరుగులతో కొనసాగుతోంది. ఇంకా రెండు వికెట్లు మిగులున్నందున ఆసీస్‌ లక్ష్యం నాలుగు వందల పరుగులు దాటే అవకాశం ఉంది. మ్యాచ్‌ అనంతరం ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌పైన్‌ మాట్లాడుతూ స్టీవ్‌స్మిత్‌ను కొనియాడాడు. అతడు ప్రత్యేక ఆటగాడని, ఆటలో ఎప్పుడూ ఇలాంటి వ్యక్తి ఒకరుండాలని అన్నాడు. బెన్‌స్టోక్స్‌ కూడా అలాంటి ఆటగాడేనని, వీరు మ్యాచ్‌లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌ ఏది చేస్తున్నా అప్రమత్తంగా ఉంటారన్నాడు. అలా ఉండడం వల్లే అత్యుత్తమ క్రికెటర్లుగా ఎదుగుతారని టిమ్‌ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా స్మిత్‌ అందుకున్న క్యాచ్‌ను ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకొచ్చాడు. 


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని