శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రూ.5.9 ట్రిలియన్‌ డాలర్ల ఖర్చు.. మరి ఫలితం?

5 లక్షలమంది వరకు చనిపోయారు..

ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఇరాక్, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాల్లో అమెరికా చేపట్టిన యుద్ధంలో దాదాపు 5 లక్షలమంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికాలోని ప్రఖ్యాత బ్రౌన్‌ విశ్వవిద్యాలయ నివేదిక వెల్లడించింది. సెప్టెంబరు 11/2001 ఉగ్రదాడుల అనంతరం అమెరికా ఉగ్రవాదంపై పోరును ప్రారంభించింది. (పాక్‌లో ఉగ్రవాద వ్యతిరేక దాడులు కేవలం అఫ్గన్‌ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపైనే జరుగుతున్నాయి) 19 ఏళ్లుగా జరుగుతున్న పోరులో ఉగ్రవాదంపై అమెరికా విజయం సాధించిందా అన్న అంశాన్ని పరిశీలిస్తే ఇప్పటికీ లేదనే వెల్లడవుతోంది. అయితే ఈ క్రమంలో అమెరికా ఆర్థికవ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని నివేదిక వెల్లడించింది. దాదాపు 5 లక్షలమంది వరకు సామాన్యులు ఈ పోరులో అసువులు బాసినట్లు తెలిపింది. అమెరికాకు వ్యయం మాత్రం 5.9 ట్రిలియన్‌ డాలర్లని తేలింది.

అంకెల్లో ఉగ్రవాదంపై పోరు..
ఉగ్రవాదులపై సైన్యం దాడులు, ఉగ్రవాదులు బాంబు పేలుళ్లను పేల్చడం, జనావాస ప్రాంతాల్లో జరిగిన పోరులో దాదాపు ఐదు లక్షలమంది చనిపోయారు.

* యుద్ధ ప్రభావంతో  పౌష్టికాహారలోపంతో లక్షలాదిమంది బాలలు అకాలమృత్యువుకు లోనయ్యారు.

* పర్యావరణం, మౌలిక సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

* దాదాపు 7 వేల మంది వరకు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మిత్రదేశాల సైనికుల సంఖ్యను తీసుకుంటే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది.

* అఫ్గన్‌, సిరియా, ఇరాక్‌.. తదితర దేశాలకు చెందిన 21 మిలియన్ల మంది ప్రజలు  తమ నివాసాలను కోల్పోయి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

* ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 దేశాల్లో అమెరికా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

* ఈ యుద్దాల నుంచి అమెరికా తప్పుకున్నా యుద్ధంలో గాయపడిన సైనికుల సంక్షేమం కోసం భారీ నిధులను కేటాయించాల్సిందే.

* దాదాపు 5.9 ట్రిలియన్‌ డాలర్ల వరకు అమెరికాకు వ్యయం అయిందని ఒక అంచనా.

*అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది తీవ్రవిఘాతం కలిగిస్తోంది. నిధుల లేమితో అమెరికాలో నిరుద్యోగం పెరగడంతో పాటు  వడ్డీరేట్లు పెరుగుతున్నాయి.

*ఇరాక్‌, ఆఫ్గనిస్థాన్‌ దేశాల్లో లక్షలాదిమంది పురుషులు మృత్యువాత పడటంతో వారిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు పేదరికంలోకి జారుకుంటున్నాయి. 

* అంతర్జాతీయంగా అన్ని సూచీల్లోనూ ఇరాక్‌, అప్గానిస్థాన్‌లు చివరి స్థానాల్లో ఉండటం యుద్దం పుణ్యమే అని చెప్పాలి.

* ఈ దేశాలకు అమెరికాతో సహా వివిధ దేశాలు విడుదల చేస్తున్న సహాయక నిధుల్లో సింహభాగం పక్కదారి పడుతున్నాయి.

*దాడులకు అమెరికా ఉపయోగించే క్షిపణులు, బాంబులతో  పర్యావరణానికి పెను విధ్వంసం కలుగుతోంది. దీంతో అటవీప్రాంతాలు ధ్వంసం కావడం, వ్యవసాయభూములు నిరుపయోగం కావడంతో ఆహార ఉత్పత్తి ఈ దేశాల్లో తగ్గిపోయింది. 

భవిష్యత్తు ఎలా?

ఇప్పటికే కనిపించని శత్రువులతో యుద్ధం చేస్తున్న అమెరికా వీటిని పక్కనబెట్టాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇదే రీతిలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా తన దాడులను కొనసాగిస్తే ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదముంది. దాడులకు వెచ్చించే నిధులను ఆయా దేశాల్లో సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని