శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

గోవు, ఓం పదాలు అంటేనే వారికి అసహనం: మోదీ

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. గోవు, ఓం పదాలు వింటేనే కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారని.. దేశాన్ని తిరిగి 16వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారన్నారు. అలాంటి అసంబద్ధ వాదనలు చేస్తున్నవారే నిజంగా దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. స్వామి వివేకానంద చికాగోలో చేసిన చరిత్రాత్మక ప్రసంగం సెప్టెంబరు 11నే చేశారని చెబుతూ ఈరోజు విశిష్టతను గుర్తుచేశారు. అలాగే దురదృష్టవశాత్తూ సెప్టెంబరు 11నే ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రదాడి జరిగిందన్నారు. ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్యగా పరిణమించిందని.. దాయాది దేశంలోనే అది పురుడుపోసుకుంటుందని పరోక్షంగా పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. 

ఈ సందర్భంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జాతీయ పశు వ్యాధి నివారణ పథకాన్ని(ఎన్‌ఏడీసీపీ) మధురలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అనేక మంది రైతులు, వ్యవసాయ కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకొన్నారు. గోసంరక్షణ కేంద్రాల్లోని ఆవుల్ని దగ్గరి నుంచి పరిశీలించారు. భారత ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ, పర్యావరణ ఉత్పత్తులు కీలక భూమిక పోషిస్తున్నాయని గుర్తుచేశారు. అందుకే స్వచ్ఛ భారత్‌, జల్‌ జీవన్‌లాంటి పథకాల్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. అయితే పర్యావరణానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత పాటించాలన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 687 జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాల్ని ప్రారంభించామన్నారు. 

ప్రతిఒక్కరూ ప్లాస్టిక్‌ వాడకానికి దూరంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌ వాడకంతో మానవాళికి ప్రమాదం పొంచి ఉందన్నారు. స్వచ్ఛతే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి మహిళలతో కలిసి వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌ని వేరుచేసే కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ని మహాత్మా గాంధీ జయంతియైన అక్టోబర్‌ 2నాటికి ప్రతిఒక్కరూ త్యజించాలని పిలుపునిచ్చారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని