శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నేను భారతీయుడిని..: ఇస్రోఛైర్మన్‌ శివన్‌

దిల్లీ: చంద్రయాన్‌-2 ప్రయోగం తర్వాత దేశమంతటా మార్మోగుతున్న పేరు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి.. అంతరిక్ష రంగంలో దేశ కీర్తిని నలుమూలలా వ్యాపింపజేస్తున్నారాయన. శివన్‌ నేతృత్వంలోనే ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి ఇస్రో చరిత్ర సృష్టించింది. అయితే తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ప్రతి భారతీయుడూ గర్వపడేలాంటి సమాధానం ఇచ్చారు. ‘‘ఇంత గొప్ప స్థానంలో ఉన్న ఒక తమిళ వ్యక్తిగా తోటి తమిళులకు మీరు ఏం చెప్పదలచుకున్నారు’’ ఆ ఛానల్‌ వ్యాఖ్యాత అడిగారు. దానికి శివన్‌ స్పందిస్తూ..‘‘నేను ఇస్రోలో ఒక భారతీయుడిగా చేరాను. అన్ని మతాలు, ప్రాంతాలు, భాషలకు చెందిన వ్యక్తులు ఇస్రోలో పని చేస్తున్నారు. ప్రాజెక్టుల్లో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. అయితే నన్ను తమ వాడిగా భావిస్తున్న నా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని శివన్‌ ఇచ్చిన సమాధానం నెటిజన్ల మనసుల్ని తాకింది. 

శివన్‌ చెప్పిన సమాధానానికి ట్విటర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రాంతం, భాష, మతం ఏదైనా ఇస్రో కీర్తిని ఇనుమడింపజేస్తున్న శివన్‌ని చూసి యావత్‌ దేశం గర్వపడుతోందని ఆయన్ను  ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సంకేతాలు నిలిచిపోయాయన్న బాధతో శివన్ ఒక్కసారిగా కన్నీటిపర్యంతం కావడం, ఆయన్ని ప్రధాని మోదీ హత్తుకొని ఓదార్చిన దృశ్యాలు నెటిజన్ల హృదయాలను ద్రవింపజేసిన విషయం తెలిసిందే. శివన్ కన్నీటిలో నిజాయతీ ఉందంటూ నెటిజన్లు ఆయన కృషిని కొనియాడారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని