మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

10కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తోన్న ‘గెండా ఫూల్‌’

వాళ్లతో పోరాడే ఆర్థిక స్థోమత నాకు లేదు: రూపకర్త

ముంబయి: ఇటీవల విడుదలైన ‘గెండా ఫూల్‌’ ఆల్బమ్‌ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు బాద్‌షా పాడిన ఈ పాటలో నటి జాక్వెలిన్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మార్చి 25న విడుదలైన ఈ పాట ప్రస్తుతం 10 కోట్లకు పైగా వ్యూస్‌తో య్యూటూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ పాట విడుదలైన నాటి నుంచి బాద్‌షా పలువురు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. బెంగాలీ రచయిత రతన్‌ కహర్‌ ఒకప్పుడు రచించి, ఆలపించిన జానపద గీతాన్ని బాద్‌షా కాపీ కొట్టి.. సదరు రచయితకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని పేర్కొంటూ నెటిజన్లు విపరీతంగా విమర్శించారు. తనపై వస్తోన్న విమర్శల గురించి స్పందిస్తూ.. ‘అన్ని విషయాలను పూర్తిగా చర్చించుకున్నా తర్వాతే మేము ఈ పాటను విడుదల చేశాం. ఇప్పటిదాకా ఈ పాటను ఎంతోమంది కాపీకొట్టారు. కానీ, రతన్‌ కహర్‌కు ఎంతమంది క్రెడిట్‌ను ఇచ్చారు? ఈ పాట విడుదలైన తర్వాత బెంగాలీ కమ్యూనిటీకి చెందిన వారు ఎంతోమంది నన్ను సంప్రదించారు. రతన్‌ కహర్‌ను సంప్రదించాలని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. నేను చేయగలిగినంత సాయం చేస్తా’ అని బాద్‌షా తెలిపారు.

‘గెండా ఫూల్‌’ పాట గురించి రచయిత రతన్‌ కహర్‌ స్పందించారు. ‘‘గెండా ఫూల్‌’ పాట విడుదలయ్యాక చాలామంది నుంచి నాకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. నా పిల్లలతో చెప్పి ఆ పాట విన్నాను. ఆ పాటలో నేను రాసిన కొన్ని పంక్తులను వాడుకున్నారు. కానీ నాకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. న్యాయపరమైన పోరాటం చేసేందుకు నా దగ్గర డబ్బు, పలుకుబడి రెండూ లేవు. ఈ విషయమై చాలామంది నాకు ఫోన్లు చేసి సాయం చేస్తానని చెబుతున్నారు. నేను పెద్దగా ఏదీ ఆశించడం లేదు. సానుకూలంగా ఏది జరిగినా అది నాకు వరమేనని భావిస్తాను.’ అని రతన్‌ అన్నారు. అనంతరం ఆయన బాద్‌షా స్పందన గురించి మాట్లాడుతూ.. ‘బాద్‌షా చాలా హుందాగా వ్యవహరించినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ, ఇప్పటివరకూ నన్ను ఏ ఒక్కరూ సంప్రదించలేదు. నాకు కనుక గుర్తింపునిచ్చి ఉంటే అది నాకు ఎంతో సాయం చేసినట్లే. నేను ఒక నిరుపేదని. నా కూతురికి పెళ్లి చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ నాకు కనుక ఏదైనా ఆర్థికసాయం అందిస్తే కొంత ఉపశమనం పొందుతాను.’ అని రతన్‌ పేర్కొన్నారు.

 

 


Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)