శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

చేబ్రోలు యువకుడి ‘జాబ్‌’పాట్‌.. ఒకేసారి 4 ఉద్యోగాలు


తండ్రి రాయుడు ఏసుబాబు, తల్లి నాగలక్ష్మితో త్రిమూర్తులు

చేబ్రోలు (గొల్లప్రోలు): తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన రాయుడు త్రిమూర్తులు(27) అనే యువకుడు రాసిన ప్రతి పోటీ పరీక్షలోనూ ప్రతిభ కనబరిచి 5 నెలల కాలంలో 4 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర సివిల్‌ ఎస్సైగా, ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ కానిస్టేబుల్‌గా, దక్షిణ మధ్య రైల్వేలో లోకో అసిస్టెంట్‌ పైలెట్‌గా, రైల్వే గ్రూప్‌-డి పోస్టుకు సైతం ఎంపికయ్యాడు. తండ్రి ఏసుబాబు సన్నకారురైతు, తల్లి నాగలక్ష్మి గృహిణి. త్రిమూర్తులు చిన్ననాటి నుంచి విద్యలో ప్రతిభ కనబరిచాడు. 10వ తరగతి వరకు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ను పిఠాపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో, బీటెక్‌ మెకానికల్‌ను చేబ్రోలులోని ఆదర్శ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివాడు. 2013లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తరువాత కాకినాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఉద్యోగ అన్వేషణ ప్రారంభించాడు. 2017 నుంచి పోటీ పరీక్షలు రాసేందుకు శిక్షణ పొంది ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు వెలువడిన 4 పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి ఉద్యోగాలు పొందేందుకు అర్హత సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ కానిస్టేబుల్‌ పరీక్షల్లో 138 మార్కులు సాధించాడు. తెలంగాణ సివిల్‌ ఎస్సైకు ఎంపికయ్యాడు. పోలీసు ఉద్యోగం అంటే చిన్ననాటి నుంచి ఇష్టమని, అందుకే ఎస్సైగా చేరుతానని ఆయన తెలిపాడు. ఒకేసారి ఇన్ని కొలువులకు ఎంపికైన ఈ యువకుడిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని