శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు చెందిన బస్సును కాకినాడ నుంచి సత్తుపల్లి వెళ్తున్న లారీ తిమ్మాపురం-అచ్చంపేట కూడలిలో వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 50 మీటర్ల దూరం ముందుకెళ్లింది. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉండగా.. ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తిమ్మాపురం ఎస్సై విజయ్‌బాబు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడ తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. 


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని