గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

‘కేంద్రంలో మేం ఉన్నాం.. గుర్తు పెట్టుకోండి’

ఎంపీ అర్విం‌ద్‌పై దాడిని ఖండించిన బండి సంజయ్‌

హైదరాబాద్‌: ఎంపీ అర్వింద్‌పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. తెలంగాణ ప్రజలు కరోనాకు భయపడితే.. తెరాస నేతలకు భాజపా భయం పట్టుకుందన్నారు. భాజపా నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా ఎప్పుడు రాజ్యాంగాన్ని అతిక్రమించలేదని చెప్పారు. కేసీఆర్‌, కవితపై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. భాజపా సిద్ధాంతం కలిగిన పార్టీ అని.. తెరాస పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని వ్యాఖ్యానించారు.

భాజపా నేతలపై దాడులకు పాల్పడితే సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. దాడులతో ప్రతిపక్షాలను కట్టడి చేద్దామనుకోవడం మూర్ఖత్వమని చెప్పారు. పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు జరగడాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. పక్కా ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలో ఉందని తెరాస గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. భాజపా నేతలపై దాడి విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. తెరాస నేతలు అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ వాటా లేని పథకాలు ఎన్నో చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడి

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని