శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే

ముంబయి: వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. తీరికలేని క్రికెట్‌ ఆడుతున్న రోహిత్‌ శర్మకు విశ్రాంతినివ్వకుండా కొనసాగించారు. డిసెంబర్‌ 6 నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. 

టీ20 జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ ధూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి.
వన్డే జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ ధూబే, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, షమి, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని