శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర

ఐరాస భద్రతా మండలిని ఆశ్రయించిన పాక్‌

దిల్లీ: ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి దీటుగా భారతీయులపైనా అలాంటి ముద్ర వేయాలని పాక్‌ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తన మిత్ర దేశం, ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనాతో కలిసి గత వారం మండలిలోని ఓ కమిటీని పాక్‌ ఆశ్రయించింది. భారత్‌కు చెందిన ఇద్దరిని ప్రపంచ ఉగ్రవాదులుగా ప్రకటించాలని కమిటీకి సమర్పించిన పత్రాల్లో పాక్‌ కోరింది. వీరు గతంలో బలూచిస్థాన్‌, పెషావర్‌లో ఉగ్రదాడులు సృష్టించినట్లు తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు సృష్టించింది. అయితే, వీరితో సహా పాక్‌ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు భారతీయులను భద్రతా దళాలు నాలుగు రోజుల క్రితమే కాబుల్‌ నుంచి రక్షించాయి. 

వీరిలో ఒకరు ఏపీకి చెందిన అప్పాజీ అంగారా కావడం విశేషం. ఈయన కాబుల్‌లోని ఓ బ్యాంకులో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పని చేస్తున్నాడు. గత జనవరిలోనే అంగారా కాబుల్‌ వదిలి వెళ్లిపోయారు. 2017 ఫిబ్రవరిలో లాహోర్‌లో జరిగిన ఉగ్రదాడితో ఇతనికి సంబంధముందని పాక్‌ ఆరోపించింది. డిసెంబరు 2014లో పెషావర్‌లోని ఆర్మీ పాఠశాలపై జరిగిన దాడిలో కూడా అంగారా నిందితుడని భద్రతా మండలి కమిటీకి సమర్పించిన పత్రంలో పాక్‌ పేర్కొంది. జమాత్‌-ఉల్‌-అహ్రర్‌ అనే ఉగ్ర సంస్థతో కలిసి పెషావర్‌లో 2016 సెప్టెంబరులో మరో దాడికి పాల్పడ్డాడని నిందలు వేసింది. దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు సృష్టించింది.

ఒడిశాకు చెందిన గోబింద పట్నాయక్‌ దుగ్గివలస (54) అనే వ్యక్తి బలూచిస్థాన్‌లో 2018లో జరిగిన ఉగ్ర దాడిలో నిందితుడని పాక్‌ నింద మోపింది. కాబుల్‌లో నివసించే ఇతనిపై గత జులైలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన భారత భద్రతా దళాలు గోబింద పట్నాయక్‌ను నాలుగు రోజుల క్రితమే కాబుల్‌ నుంచి రక్షించాయి.

మరో రెండు ఉగ్ర ఘటనలకు భారతీయులైన అజోయ్‌ మిస్త్రీ, వేణుమాధవ్‌తో సంబంధముందని పాక్‌ భద్రతామండలి కమిటీకి సమర్పించిన పత్రంలో వెల్లడించింది. 

మరోవైపు, పాక్‌లోని భవల్‌పూర్‌లో ఈ వారంలోనే ఇద్దరు భారతీయులను పాక్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం వీరు పాకిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపించింది. నిజానికి వీరి గురించి అప్పుడే భారత అధికారులు పాక్‌కు సమాచారం అందించినా.. భద్రతా మండలి కమిటీ ముందు పాకిస్థాన్‌ అసత్యాలు వెల్లడించింది. చైనా సహాయంతో భారత్‌ను ‘టెర్రర్ ఫ్యాక్టరీ’గా ముద్ర వేయాలని పాక్‌ ప్రయత్నాలు జరుపుతున్నట్లు భారత అధికారులు తెలిపారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని