శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తాం

సున్నీ వక్ఫ్‌ బోర్డు

దిల్లీ: వివాదాస్పద అయోధ్య కేసు తుది తీర్పుపై సున్నీ వక్ఫ్‌ బోర్డు స్పందించింది. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నప్పటికీ.. తాము అసంతృప్తిగా ఉన్నామని తెలిపింది. దీనిపై ప్రత్యేక సమావేశం జరిపి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించింది. తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తామని పేర్కొంది.
‘సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. కానీ , దీన్ని తీర్పుగా మేం పరిగణించలేం. అంటే దీనర్థం మేం తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అని కాదు. సుప్రీం నిర్ణయం తర్వాత దేశ పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏ వైపు నుంచి ఎలాంటి నిరసనలు వ్యక్తం కాకూడదు. కానీ, తీర్పు మాత్రం మాకు సంతృప్తికరంగా లేదనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పగలం. 5 ఎకరాల కొత్త స్థలం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది?. రివ్యూ పిటిషన్‌ వేయడం మా హక్కు’ అని సున్నీ వక్ఫ్‌ బోర్డు తెలిపింది. వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని