శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

వాట్సప్‌ గ్రూప్‌కి పేరు పెడుతున్నారా? జాగ్రత్త!

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సప్‌.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే మెస్సేజింగ్‌ యాప్‌. కేవలం చాటింగ్‌ మాత్రమే కాక ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్స్‌తో ఎంతో మందికి చేరువైంది. రోజు రోజుకూ దీన్ని ఉపయోగించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అదే స్థాయిలో ఈ యాప్‌ను దుర్వినియోగం చేస్తున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. దీన్ని తగ్గించేందుకు గత సంవత్సర కాలంగా వాట్సప్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏదైనా వాట్సప్‌ గ్రూపు పేరుగానీ, ఐకాన్‌ గాని చట్ట విరుద్ధంగా ఉన్నట్లయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సదరు గ్రూపును, అందులోని సభ్యులను వాట్సప్‌ వినియోగించకుండా నిషేధించనుంది. ఈ మేరకు అమెరికాకు చెందిన సామాజిక వార్తా మాధ్యమం రెడిట్‌లో మోవ్‌ అనే యూజర్‌ దీని గురించి రాసుకొచ్చారు. 

ఆయన సభ్యుడిగా ఉన్న యూనివర్శిటీ వాట్సప్‌ గ్రూపు పేరును పిల్లల లైంగిక వేధింపుల అర్థం వచ్చేలా గ్రూపు సభ్యుడొకరు మార్చారు. దాన్ని కారణంగా చూపుతూ వాట్సప్‌ ఆ గ్రూపుని, గ్రూపులోని సభ్యులందరినీ సస్పెండ్ చేసినట్లుగా తెలిపారు. దీనికి సంబంధించి వారు వాట్సప్‌ను సంప్రదించగా నిబంధనలు అతిక్రమించారనే కారణంతో వారిపై నిషేధం విధించినట్లుగా పేర్కొంది. ఒక వారం తర్వాత ఎటువంటి సమాచారం లేకుండానే తిరిగి ఆ గ్రూపును పునరుద్ధరించినట్లుగా తెలిపారు. యాభై మంది సభ్యులున్న మరో వాట్సప్‌ గ్రూపు పేరు ‘డిస్గస్టింగ్’గా మార్చారు. అలా మార్చిన కొద్ది గంటల్లోనే సభ్యులందరినీ వాట్సప్‌ నిషేధించింది. తిరిగి 27 రోజుల నిషేధకాలం తర్వాత ఆ ఖాతాలను పునరుద్ధరించినట్లు మరో యూజర్‌ తెలిపారు. 

ఈ నిషేధ ప్రక్రియ ఆటోమేటెడ్‌ ప్రాసెస్‌గా పలువురు అభిప్రాయపడుతున్నారు. మెటాడేటా ద్వారా వాట్సప్‌ గ్రూపు ఐకాన్‌, పేరు ఆధారంగా సర్వర్‌ వాటిని ఆటోమేటిగ్గా తొలగిస్తున్నట్లు తెలుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, వాట్సప్‌లో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ కారణంగా అవాస్తవాలు, ద్వేషపూరిత వార్తలు వ్యాపింపజేసే గ్రూపుల మధ్య సంభాషణను గుర్తించటం కష్టం. అటువంటి చట్టవిరుద్ధమైన గ్రూపులను కనుగొనేందుకు వాట్సప్‌ ఈ తరహా విధానాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, దీనివల్ల గ్రూపులో ఓ వ్యక్తి కారణంగా అందులోని సభ్యులందరూ నిషేధానికి గురవుతుండడం గమనార్హం. ఒకవేళ మీరు అడ్మిన్లుగా ఉన్న వాట్సాప్‌ గ్రూపు పేర్లు గానీ, ఐకాన్లుగానీ చట్ట విరుద్ధంగా ఉంటే వాటిని వెంటనే మార్చుకోండి. లేదంటే మీరూ నిషేధానికి గురికావాల్సి ఉంటుంది. జర జాగ్రత్త!

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని