శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అది కోహ్లీకి సాధ్యం కాకపోవచ్చు: సెహ్వాగ్‌

ముంబయి: భారత తాత్కాలిక సారథి రోహిత్‌శర్మను టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సాధించలేనిది కూడా రోహిత్‌ సాధిస్తాడని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘సచిన్‌ ఆడుతున్నప్పుడు ‘నేను చేసేది నువ్వు చేయగలవు’ అని నాతో చెప్పేవాడు. కానీ, తను సాధించేది ఎవరూ చేయలేరని అతడికి తెలియదు. రోహిత్‌శర్మ కూడా అలాంటి ఆటగాడే. హిట్‌మ్యాన్‌ సాధించేది కోహ్లీ సాధించకపోవచ్చు. ఒకే ఓవర్‌లో కోహ్లీ  3-4 సిక్సర్లు, 45 బంతుల్లో 80-90 పరుగులు బాదడం మనం ఎక్కువసార్లు చూడలేదు’’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ చెలరేగాడు. 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 85 పరుగులు సాధించాడు. ధావన్‌ (31), శ్రేయస్‌ అయ్యర్ (24*) కూడా రాణించడంతో సిరీస్‌ను 1-1తో భారత్ సమం చేసింది. నిర్ణయాత్మక ఆఖరి టీ20 నాగ్‌పుర్‌ వేదికగా ఆదివారం జరగనుంది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని