గురువారం, జులై 16, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సచిన్‌, పాంటింగ్‌ రికార్డులపై రోహిత్‌, కోహ్లీ కన్ను!

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చేరుకుంటారా?

ముంబయి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నారు. రోహిత్‌.. పాంటింగ్‌ రికార్డుపై కన్నేస్తే, కోహ్లీ.. సచిన్‌ తెందూల్కర్‌ రికార్డుపై కన్నేశాడు. భారత్‌ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్‌ అగ్రస్థానంలో ఉండగా పాంటింగ్‌ రెండో స్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానంలో రోహిత్‌ ఉన్నాడు. మరోవైపు ఇరు జట్ల మధ్య అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలోనూ సచిన్‌ తొలి స్థానంలో నిలవగా కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ ఎలా చెలరేగుతారో చూడాలి. ఇదిలా ఉండగా గతేడాది భారత్‌లో పర్యటించిన ఆసీస్‌ 5 వన్డేల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కంగారూలపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 

రోహిత్‌ ఈ సిరీస్‌లో ఇంకో 128 పరుగులు చేస్తే ఇరు జట్ల మధ్య వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌ను అధిగమించే అవకాశం ఉంది. 
 అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ 
* సచిన్‌‌       : 71 మ్యాచ్‌ల్లో 44.59 సగటుతో 3077 పరుగులు
* రికీపాంటింగ్‌ : 59 మ్యాచ్‌ల్లో 40.07 సగటుతో 2164 పరుగులు
* రోహిత్‌ శర్మ : 37 మ్యాచ్‌ల్లో 61.72 సగటుతో 2037 పరుగులు
* విరాట్‌ కోహ్లీ : 37 మ్యాచ్‌ల్లో 53.96 సగటుతో 1727 పరుగులు
* ఎంఎస్‌ ధోనీ : 55 మ్యాచ్‌ల్లో 44.86 సగటుతో 1660 పరుగులు

ఇక కోహ్లీ విషయానికొస్తే ఇదే సిరీస్‌లో ఒక శతకం సాధిస్తే సచిన్‌ సరసన చేరతాడు. ఒకవేళ రెండు శతకాలు బాదితే క్రికెట్‌ దిగ్గజాన్ని అధిగమించే అవకాశం ఉంది. 

అత్యధిక శతకాలు చేసిన బ్యాట్స్‌మెన్‌
* సచిన్‌        : 71 మ్యాచ్‌ల్లో 9 శతకాలు
* విరాట్‌ కోహ్లీ  : 37 మ్యాచ్‌ల్లో 8 శతకాలు
* రోహిత్‌ శర్మ  : 37 మ్యాచ్‌ల్లో 7 శతకాలు
* రికీ పాంటింగ్‌ : 59 మ్యాచ్‌ల్లో 6 శతకాలు
* వీవీఎస్‌ లక్ష్మణ్‌: 21 మ్యాచ్‌ల్లో 4 శతకాలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని