శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

‘నిమజ్జనం’ సెలవు ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్‌: వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జంట నగరాలు, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలకు ఈ సెలవు వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గురువారం సెలవు ప్రకటిస్తున్నందున ఈనెల 14న (రెండో శనివారం) పనిదినంగా స్పష్టం చేసింది. నిమజ్జనం సందర్భంగా జంట నగరాలతో పాటు, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గణేశుడి శోభాయాత్ర ఘనంగా నిర్వహించనున్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతితో పాటు బాలాపూర్‌ గణనాథుడి భారీ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. దీంతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న చాలా విగ్రహాలను రేపే నిమజ్జనం చేయనున్నారు. దీనికోసం అధికారులు హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌ చెరువు, దుర్గంచెరువు తదితర  ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని