శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఇప్పటి వరకు 170 మందిని అరెస్టు చేశాం: సీపీ

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఐకాస, విపక్షాలు సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు.శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. కొందరు ఐకాస నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీకుల చెందిన  కొందరు నేతలను శుక్రవారమే అరెస్టు చేశామని ఆయన చెప్పారు. ట్యాంక్ బండ్‌పై వాతావరణం ప్రశాంతంగా ఉందని అంజనీకుమార్‌ వెల్లడించారు. 
సుప్రీం తీర్పు- నగరంలో పటిష్ఠ బందోబస్తు
దేశ వ్యాప్తంగా  చర్చనీయాంశమైన అయోధ్యలో రామమందిరం- బాబ్రీమసీదు కేసుపై సుప్రీం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో నగరంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అంజనీకుమార్ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సభలు, సమావేశాలు, నిరసనలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. సున్నిత ప్రదేశాల్లో పోలీస్ పికెట్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆదివారం నిర్వహించబోయే మిలాద్ ఉన్ నబీ ర్యాలీ దృష్ట్యా..అన్ని జోన్లలో బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ వివరించారు. దేశంలోనే హైదరాబాద్‌కు మంచి పేరుందని, ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఆందోళనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని