సోమవారం, జులై 13, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

టిక్‌టాక్‌.. మరింత భారతీయం

భారత్‌లో రెండో కార్పొరేట్‌ సంస్థ ఏర్పాటు త్వరలో

దిల్లీ: టిక్‌టాక్‌, హెలో యాప్‌ల యజమాని బైట్‌డాన్స్‌ త్వరలో భారత్‌లో రెండో కార్పొరేట్‌ సంస్థను ఏర్పాటు చేయనుంది. భారత్‌లో తన మూలాలను పెంచుకోవాలని ఈ చైనా కంపెనీ భావిస్తోంది. ఈ కొత్త సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బైట్‌డాన్స్‌కు ఉన్న అన్ని యాప్‌లు, ప్లాట్‌ఫామ్స్‌కు ఐటీ, ఐటీ ఆధారిత సేవలు అందజేయనున్నారని ఈ పరిణామాలతో సంబంధమున్న విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్లపత్రిక తన కథనంలో పేర్కొంది. వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్‌ పెంచడంపైనా ఈ కంపెనీ దృష్టిసారించనుంది.

త్వరలో దరఖాస్తు
11000 కోట్ల డాలర్ల సెకండరీ ప్రైవేట్‌ మార్కెట్‌ విలువ కలిగిన ఈ కంపెనీకి, వీడియో యాప్‌ టిక్‌టాక్‌, సామాజిక మాధ్య ప్లాట్‌ఫాం హెలో యాప్‌లతో పాటు.. కంటెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ కూడా ఉన్నాయి. వచ్చే కొద్ది వారాల్లోనే పారిశ్రామిక ప్రోత్సాహకాల, అంతర్గత వాణిజ్య విభాగానికి, ఇతర ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు బైట్‌డాన్స్‌ దరఖాస్తు చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ బైట్‌డాన్స్‌ ఇండియా సర్వీసెస్‌ లిమిటెడ్‌ పేరుతో దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

సిబ్బంది పెంపు
భారత్‌లో సిబ్బందిని పెంచుకోవాలని బైట్‌డాన్స్‌ భావిస్తున్న నేపథ్యంలో భారత్‌కు డేటా, సాంకేతికత బదిలీ జరగనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నవంబరు 2019 నాటికి బైట్‌డాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 60,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. 15 పరిశోదన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాలూ ఉన్నాయి. భారత్‌లో టిక్‌టాక్‌ యాప్‌ను 61.1 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్త పరిమాణంలో ఇది 30.3 శాతానికి సమానం. అంతర్జాతీయంగా 200 కోట్ల మందికి పైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం విశేషం.

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని