శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

నేడే అయోధ్య తీర్పు

దిల్లీ: అయోధ్య భూ వివాదంపై నేడు తుది తీర్పు వెలువడనుంది. ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించే అవకాశముంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. జస్టిస్‌ ఎస్‌.ఎ బొబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌.ఎ. నజీర్‌ ఈ ధర్మాసనంలో ఉన్నారు. అత్యంత సున్నితమైన అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసు తీర్పు కోసం దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో సుమారు 4వేల మంది పారా మిలిటరీ సిబ్బందిని మోహరించారు. అయోధ్యలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది.

నేపథ్యమిదీ..

బాబ్రీ మసీదు స్థలంలో గతంలో రామ మందిరం ఉండేదని, దాన్ని కూల్చి మసీదు నిర్మించారన్నది హిందువుల వాదన. అలాంటిదేమీ లేదని ముస్లిం పక్షాలు వాదిస్తున్నాయి. దీంతో ఆ స్థల వివాదంపై దాఖలైన నాలుగు సివిల్‌ దావాలపై అలహాబాద్‌ హైకోర్టు 2010లో కీలక తీర్పు వెలువరించింది. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులు.. సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌ లల్లాలు సమానంగా పంచుకోవాలని స్పష్టంచేసింది. తీర్పును సవాల్‌ చేస్తూ 14 పిటిషన్లు దాఖలు కాగా 2011 మేలో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత మధ్యవర్తిత్వానికి అవకాశమిచ్చినా ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి అక్టోబర్‌ 16 వరకూ రోజువారీ విచారణ చేపట్టింది. తుది తీర్పును రిజర్వ్‌ చేసింది.


Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని