శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మారిన ‘మూడ్‌’.. 12వేల దిగువకు నిఫ్టీ

ముంబయి: వరుస లాభాలతో దూసుకెళ్తున్న మార్కెట్ల జోరుకు అడ్డుకట్ట పడింది. స్థిరాస్తి రంగానికి ఊతం, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో జీవితకాల గరిష్ఠాలు నమోదు చేసిన మార్కెట్లు రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇచ్చిన షాక్‌తో నేల చూపులు చూడాల్సి వచ్చింది. మందగించిన వృద్ధిరేటు కారణంగా రేటింగ్‌ను తగ్గించడం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అయితే, బ్యాంకింగ్‌ షేర్ల అండనివ్వడం మార్కెట్లు భారీ నష్టాల నుంచి గట్టెక్కాయి. దీంతో సెన్సెక్స్‌ 330 పాయింట్లు కోల్పోయి 40,323 వద్ద స్థిరపడింది. నిఫ్టీ  పాయింట్లు కోల్పోయి 12వేల దిగువకు చేరి 11,908 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.26గా ఉంది. నిఫ్టీలో యస్‌బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌, ఐసీఐసీఐ, ఐషర్‌ మోటార్స్‌, కోటక్‌ మహీంద్రా షేర్లు లాభపడగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ఫార్మా, గెయిల్‌, యూపీఎల్‌, వేదంతా షేర్లు నష్టాలు చవిచూశాయి.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని