శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అర్జున్‌రెడ్డి రీమేక్.. షాకైన హీరో

ముంబయి: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా తెలుగులో విజయవంతమైన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. సందీప్‌ వంగా దర్శకుడు.  ఈ సినిమాని హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో తెరకెక్కించారు దర్శకుడు సందీప్‌. షాహిద్‌ కపూర్‌ కథానాయకుడు. కియారా అడ్వాణీ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా షాహిద్‌కపూర్‌ నటనకు సినీ ప్రముఖులతోపాటు ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. తాజాగా ఓ నెటిజన్‌ సోషల్‌మీడియా వేదికగా ‘కబీర్‌ సింగ్‌’ సినిమాలోని క్లైమాక్స్‌ సన్నివేశంలో షాహిద్‌ ఒళ్లు గగుర్పొడిచింది అనే విషయాన్ని తెలియచేస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు.

‘ఒక నటుడు సినిమాలోని పాత్రను తన జీవితంతో అన్వయించుకుని.. ఎమోషన్స్‌ను పండించినప్పుడే ప్రేక్షకులు ఆ సినిమాపట్ల ఆసక్తి కనబరుస్తారు. షాహిద్‌కపూర్‌ నటించిన ‘కబీర్‌ సింగ్‌’ సినిమాలో ఆయన తండ్రి అవుతున్నాడనే విషయం తెలిసిన సన్నివేశంలో ఆయనకి ఒళ్లు గగుర్పొడించింది.’ అని దానికి సంబంధించిన ఫొటోలను జత చేస్తూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేసింది.

కాగా ఈ ట్వీట్‌ను చూసిన షాహిద్‌ స్పందిస్తూ.. ‘నాకు కూడా ఈ విషయం తెలియదు. సినిమా ఎడిటింగ్‌ సమయంలో దీనిని గుర్తించిన మా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా నాకు ఈ విషయాన్ని తెలియచేశారు. మీరు ఈ విషయాన్ని చాలా అద్భుతంగా గుర్తించారు.’ అని ఆయన తెలిపారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని