శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం

దిల్లీ: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం మానవతా దృక్పథంతో గురువారం వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీవోకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు. పీవోకే తంగ్దర్‌ సెక్టార్‌లోని స్థానికుల సాయంతో 2019 మే 17న షబీర్‌ అహ్మద్‌ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత భారత సైనికులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ వ్యక్తిని తిరిగి అప్పగించాలంటూ పీవోకే అధికారులు ఇటీవల భారత సైన్యాన్ని సంప్రదించారు. భారత సైన్యం మానవతా దృక్పథంతో ఆలోచించి తంగ్దర్‌ సెక్టార్‌లోని తిత్వాల్‌ క్రాసింగ్‌ వద్ద అతడిని పాక్‌ అధికారులకు అప్పగించింది.

ఇటీవల భారత్‌కు చెందిన ఇద్దరు పౌరులు అనుకోకుండా సరిహద్దులు దాటడంతో పాక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారికి కాన్సులర్‌ యాక్సెస్‌ కల్పించి, ఎలాంటి హానీ లేకుండా తిరిగి పంపాలంటూ భారత విదేశాంగ శాఖ ఆ దేశానికి విజ్ఞప్తి చేసింది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని