శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

పంత్‌కు సంగా, లక్ష్మణ్‌ ‘సరళ’ సలహాలు

దిల్లీ: టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌పంత్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌ను సరళంగా చేయాలని శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం కుమార సంగక్కర అన్నారు. అప్పుడే వైఫల్యాల నుంచి బయటపడి విజయవంతం అవుతాడని వెల్లడించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో శతకాలు చేసిన పంత్‌ ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. వికెట్ల వెనక తప్పిదాలు చేస్తూ విమర్శల పాలవుతున్నాడు. బంగ్లాదేశ్‌తో టీ20లోనూ అతడు వికెట్ల ముందు బంతి అందుకొని స్టంపౌట్‌ చేసిన సంగతి తెలిసిందే.

‘పంత్‌ తన బలహీనతలను అర్థం చేసుకొని బ్యాటింగ్‌, కీపింగ్‌ను సరళంగా చేయాలి. వీటిపై పనిచేశాక అతడు వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ఆడాలి. ఒత్తిడి దరిచేరనీయొద్దు. ఒత్తిడిని తొలగించేందుకు ఎవరైనా ఒకరు అతడితో మాట్లాడితే మంచిది. ఒక వికెట్‌ కీపర్‌ వికెట్ల వెనకాల పద్ధతిగా, చక్కగా ఉండాలి. అప్పుడే అతడు ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. సమీక్షల విషయంలో సారథికి సరైన సమాచారం చెప్పగలడు. ప్రపంచకప్‌ విషయాన్ని దృష్టిలో పెట్టుకొంటే పంత్‌ తన పాత్రను అర్థం చేసుకొని సారథికి సరైన సమాచారం ఇవ్వడం అత్యంత కీలకం’ అని సంగా అన్నారు.

సంగక్కర అభిప్రాయంతో హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఏకీభవించారు. బ్యాటింగ్‌ విషయంలో పంత్‌ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘ఐపీఎల్‌ వరకు సెలక్టర్లు బౌలింగ్‌ విభాగంలో ప్రయోగాలు చేస్తారని అనుకుంటున్నా. బ్యాటింగ్‌పై దృష్టిపెడితే మాత్రం మొదట రిషభ్‌ ప్రదర్శనను సమీక్షిస్తారు. అతడికి జట్టు యాజమాన్యం, సెలక్షన్‌ కమిటీ ఆత్మవిశ్వాసం కలిగించడం ముఖ్యం. ప్రతి మ్యాచ్‌ ప్రపంచకప్‌నకు ఆడిషన్‌ అనే భావన కలగనీయొద్దు. ఆటగాళ్లు అదే మనస్తత్వంతో ఆడితే సహజ శైలిలో ఆడలేరు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామనే ఆలోచనా ధోరణితో ఉండాలి’ అని లక్ష్మణ్ తెలిపారు.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని