శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సల్మాన్‌తో దిశా మరోసారి..

ముంబయి: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ముద్దుగుమ్మ దిశా పటానీ మరోసారి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ‘భారత్‌’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ పూర్తిస్థాయి కథానాయికగా కనిపించారు. దిశా కొన్ని సన్నివేశాల్లో సందడి చేశారు. దీని తర్వాత సల్మాన్‌ ‘దబాంగ్‌ 3’లో నటించారు. డిసెంబరు 20న సినిమా విడుదల కాబోతోంది. త్వరలో సల్మాన్‌ కథానాయకుడిగా ‘రాధే: ఇండియాస్‌ మోస్ట్ వాంటెడ్‌ కోప్‌’ పట్టాలెక్కబోతోంది. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో కథానాయిక పాత్ర కోసం అనుష్క శర్మను అనుకుంటున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు దిశా పటానీ పేరు వినిపిస్తోంది. దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నవంబరు 4న ముంబయిలో ‘రాధే: ఇండియాస్‌ మోస్ట్ వాంటెడ్‌ కోప్‌’ షెడ్యూల్‌ ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది. కొరియన్‌ సినిమాకు రీమేక్‌గా దీన్ని తీయబోతున్నట్లు సమాచారం. ‘వాంటెడ్‌’, ‘దబాంగ్‌ 3’ తర్వాత సల్లూభాయ్‌-ప్రభుదేవా కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా ఇది.

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని