శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఇకపై కెమెరా ఎక్కడుందో చూసుకుంటా: రోహిత్‌

భావోద్వేగంపై కొంటెగా స్పందించిన తాత్కాలిక కెప్టెన్‌

రాజ్‌కోట్‌: మైదానంలో ప్రశాంతంగా కనిపించే రోహిత్‌శర్మ గురువారం జరిగిన రెండో టీ20లో ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. ఈ విషయంపై స్పందించిన తాత్కాలిక కెప్టెన్‌ తాను మైదానంలో భావోద్వేగంతో ఉంటానన్నాడు. అసలేం జరిగిందంటే.. బంగ్లా బ్యాటింగ్‌ చేస్తుండగా చాహల్‌ 13వ ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. సౌమ్య సర్కార్‌ మిస్‌ అయిన ఓ బంతిని కీపర్‌ రిషభ్‌ పంత్‌ అందుకొని అతడిని స్టంపౌట్‌ చేశాడు. ఫీల్డ్‌ అంపైర్‌ అనుమానంతో థర్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేయగా ఫలితం భారీ తెరపై నాటౌట్‌ అని వచ్చింది. ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన రోహిత్‌ థర్డ్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

జరిగిన పొరపాటును గుర్తించగా వెంటనే మళ్లీ స్క్రీన్‌పై ఔట్‌ అని కనిపించింది. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన హిట్‌మ్యాన్‌ ఈ విషయంపై స్పందించాడు. ‘మైదానంలో నేను చాలా భావోద్వేగంతో ఉంటాను. గత మ్యాచ్‌లో తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు మైదానంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అలా జరిగింది. అయితే ఫీల్డింగ్‌లో మా జట్టు కాస్త అలసత్వం ప్రదర్శించింది. అంతిమంగా మ్యాచ్‌ గెలవాలనే అనుకుంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు భావోద్వేగానికి గురవుతాం. ఇకపై కెమెరా ఎక్కడుందో చూసుకుంటా’ అని నవ్వులు పూయించాడు. 

Tags:

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని