శుక్రవారం, జులై 10, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం

సిరీస్‌ గెలిచాక.. రోహిత్‌, కోహ్లీ ఏమన్నారంటే?

బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు. ఆసీస్‌ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 47.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌శర్మ (119; 128 బంతుల్లో 8x4, 6x6), విరాట్‌ కోహ్లీ(89; 91 బంతుల్లో 8x4) అద్భుతంగా ఆడి రెండో వికెట్‌కు విలువైన 137 పరుగుల భాగస్వామ్యం జోడించారు. నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. దీంతో టీమిండియా విజయానికి గట్టి పునాది వేశారు. భారత్‌ గెలిచాక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన రోహిత్‌ మాట్లాడుతూ కోహ్లీతో కలిసి భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని అనుకున్నట్లు చెప్పాడు.

ఇది నిర్ణయాత్మకమైన మ్యాచ్‌ కావడంతో ఆస్ట్రేలియాను 290లోపు కట్టడి చేయడం మంచిదైందని హిట్‌మ్యాన్‌ అన్నాడు. లక్ష్య ఛేదనలో కేఎల్‌ రాహుల్‌ ఔటయ్యాక ఏం చేయాలనేదానిపై తమకు స్పష్టత ఉందన్నాడు. కోహ్లీ, తాను పెద్ద భాగస్వామ్యం నిర్మించాలని అనుకున్నామని, అందుకు కెప్టెన్‌కు మించిన బ్యాట్స్‌మన్‌ లేడని చెప్పాడు. టీమిండియా వ్యూహంలో ఆ భాగస్వామ్యం ఎంతో కీలకమన్నాడు. ఇద్దరిలో ఒకరు నెమ్మదిగా ఆడుతూ మరొకరు ధాటిగా ఆడాలని మధ్యలో నిర్ణయించుకున్నామని, ఆ విధంగానే 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించామన్నాడు. తర్వాత తాను స్వేచ్ఛగా షాట్లు ఆడతానని కోహ్లీతో చెప్పానని, తద్వారా శతకం సాధించానని తెలిపాడు. ఒకవేళ టీమిండియా వికెట్లు కోల్పోయింటే పరిస్థితి మరోలా ఉండేదని రోహిత్‌ అన్నాడు. కీలక మ్యాచ్‌ల్లో ఆసీస్‌ బౌలర్లు సవాలు విసురుతారని, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడాలనుకున్నది ఈ మ్యాచ్‌లో ఆడానన్నాడు. కాగా, ఈ రోజు 35 ఓవర్ల వరకు ఉండాలనుకున్నట్లు రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికైన కోహ్లీ మాట్లాడుతూ తమకు మంచి ఆరంభం లభించిందని చెప్పాడు. రోహిత్‌, రాహుల్‌ శుభారంభం ఇచ్చారని, రాహుల్‌ ఔటయ్యాక తామిద్దరం మంచి భాగస్వామ్యం నిర్మించాలనుకున్నామని చెప్పాడు. రాహుల్‌ ఔటయ్యే సమయానికి బంతి తిరుగుతుందని, అలాంటప్పుడు తమ అనుభవంతో ఓపికగా ఆడాలనుకున్నామని కోహ్లీ అన్నాడు. ఆసీస్‌కు వికెట్లు ఇవ్వకపోతే తర్వాత ఓవర్‌కు 7-8 పరుగులు చేయోచ్చనే అనుకున్నామని కోహ్లీ తెలిపాడు. ఆ విధంగా రోహిత్‌ ఈ రోజు బాగా ఆడాడని కెప్టెన్‌ మెచ్చుకున్నాడు. గత నాలుగైదేళ్లుగా తాము ఇలాగే ఆడుతున్నామని, ఒకరు ఆడుతుంటే మరొకరు సహకరించుకోవాలని ముందే ప్రణాళిక రచించుకున్నామని చెప్పాడు. ఏదైమైనా ఆసీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ విజయం సాధించాలనే బరిలోకి దిగామన్నాడు.

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని